కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపటిలో ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

 The Budget Meetings Of Parliament Will Begin Soon-TeluguStop.com

అయితే, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్, ఆప్ నిర్ణయం తీసుకున్నాయి.రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంట్ ముందు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

ఉభయ సభల్లో రాష్ట్రపతి మొదటి సారి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవమన్న ఆయన ఆదివాసీలు, మహిళలకు ఇచ్చే గౌరవమని తెలిపారు.

ఈ కారణంగానే యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని మోదీ వ్యాఖ్యనించారు.ఇండియా ఫస్ట్…సిటిజన్ ఫస్ట్ ను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube