అక్కతో రాఖీ కట్టించుకోవాలని వచ్చాడు..కానీ రాఖీతో కన్నీటి వీడ్కోలు పలకాల్సి వచ్చింది.. ఏమైంది  

The Brother Came For Sisters Rakhi And Died In Tiruvuru-

‘‘ఒరేయ్‌ తమ్ముడూ.నాకు అండగా ఉంటావనుకున్నాన్రా..

The Brother Came For Sisters Rakhi And Died In Tiruvuru--The Brother Came For Sisters Rakhi And Died In Tiruvuru-

రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా…?’’ అంటూ అక్క శిరీష గుండె బాదుకుంటూ ఏడుస్తుంటే.చూసేవారు అంత కన్నీరుమున్నీరు అయ్యారు.

రాఖీ కడుతుంటే ఏ సోదరైనా సంతోషంతో ఉబ్బితబ్బిబవుతుంది.కానీ ఆ అక్క మాత్రం పుట్టెడు దుఃఖంతో కట్టింది.

నిర్జీవంగా ఉన్న తమ్ముడికి కడసారి రాఖీ కడుతూ.ఇక రాడు అనే మాటను మనసులోనే దాచుకుని.

మౌనంగా రక్షాబంధనాన్ని కట్టేసింది.ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్ లో జరిగింది.

వివరాలలోకి వెళ్తే.

కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ గిరిబాబుకు వినోద్, శిరీష అని ఇద్దరు సంతానం.శిరీష పెద్దది కాగా.

వినోద్ సత్తుపల్లిలో డిప్లొమా చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాడు.రాఖీ పండుగ ఉండటంతో ఇంటికొచ్చాడు..

సత్తుపల్లిలో తనతో కలిసి చదువుకున్న హిమకిరణ్‌ అతడికి ప్రాణమిత్రుడు.స్నేహితుల దినోత్సవాన అతణ్ని, ఇతర మిత్రులను కలిసేందుకు వినోద్ సత్తుపల్లి వచ్చాడు.వారిద్దరూ కలిసి సరదాగా.

అక్కడికి సమీపంలోని బేతుపల్లి చెరువుకు కార్లో వెళ్లారు.అలుగు పోస్తున్న చూసే క్రమంలో కారు అదుపు తప్పి చెరువులో పడింది.

ఇద్దరూ కారు డోర్లు తెరుచుకొని అతికష్టం మీద బయటకొచ్చే ప్రయత్నం చేశారు.అక్కడికి సమీపంలోని వారు వీరిద్దర్నీ జాగ్రత్తగా పైకి లాగుతుండగా.వినోద్ ఫోన్ కింద పడిపోవటంతో.దాన్ని అందుకునే క్రమంలో అతడు నీటిలో గల్లంతయ్యాడు.

అతడి మృతదేహం సోమవారం లభ్యమైంది.మార్చురీలో విగత జీవిగా పడి ఉన్న తమ బిడ్డను చూడలేక ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చారు.తమ్ముడిని నిర్జీవంగా చూసిన అక్క శిరీష కన్నీరు మున్నీరయ్యింది.

వెంటనే తేరుకుని.తన తమ్ముడి కడసారి చూపుకు రాఖీతో కన్నీటి వీడ్కోలు పల్కింది.

సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద పెద్ద చెరువులోకి ఆదివారం కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్ చారి చనిపోయాడు.ఆయన మృతదేహాన్ని సోమవారం ఉదయం బయటకు తీశారు.వినోద్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.అందులోనూ సోమవారం రాఖీ పండగ కావడం.

ఆ ఇంట మరింత విషాదం నింపింది.తమ్ముడిని నిర్జీవంగా చూసిన అక్క శిరీష కన్నీరు మున్నీరయ్యింది..

వెంటనే తేరుకుని.తన తమ్ముడి కడసారి చూపుకు రాఖీతో కన్నీటి వీడ్కోలు పల్కింది.