ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్లకు ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన బ్రిటీష్ సర్కార్..!

భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు దేశాలు భారత ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి.ఇంగ్లాండ్ కూడా భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

 British Government Relief To Team India Cricket Players Over Corona Restrictions-TeluguStop.com

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పౌరులను తప్ప వేరే వారిని రానివ్వడం లేదు.అయితే భారత క్రికెట్ జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

దాదాపు మూడు నెలలు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ లోనే ఉంటారు.పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది.

రెండు జట్లు కలిసి ఇంగ్లాండ్ కు వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇంగ్లాండ్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

ఆటగాళ్లకు కఠిన ఆంక్షల నుంచి పలు సడలింపులు వచ్చేలా చేసింది.భారత జట్టు జూన్‌ 2న ఇంగ్లాండ్ కు పయనం కానుంది.3వ తేదీ నుంచి టీమిండియా ఆటగాళ్లు, ఇతర సిబ్బంది సౌథాంప్టన్‌లో క్వారంటైన్‌లో ఉంటారు.భారత పురుషుల జట్టు జూన్‌ 18న న్యూజిలాండ్‌ తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Telugu Bcci, Big, Bio Bubble, British, British Sarkar, Corona, England, Quaranti

ఆ తర్వాత నెలరోజులు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది.ఇంగ్లాండ్‌ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది.బుధవారం లోపు భారత జట్టు ఆటగాళ్లంతా ముంబైకి చేరుకుని.అక్కడి నుంచి మే 24న బయో బబుల్‌లోకి వెళ్తారు.

ముంబైలో ఉండే వాళ్ళైతే మే 24న నేరుగా బయో బబుల్‌లోకి వెళ్ళవచ్చు.వేరే ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బీసీసీఐ హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై నుంచి ఛార్టర్‌ విమానాలు ఏర్పాటు చేసింది.

బెంగళూరులోని క్రికెటర్లు చెన్నై నుంచి వస్తారు.కోల్‌కతా ఆటగాళ్లు బిజినెస్ ఫ్లైట్‌లో వస్తారు.

గుజరాత్‌ నుండి వచ్చేవాళ్లు కూడా అలానే వస్తారు.మూడు నెలల పర్యటన కావడంతో క్రికెటర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఇంగ్లాండ్ కి వెళ్లనున్నారు.

వారు కూడా బయో బాబుల్ లో ఉండాలి.క్రికెటర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షల నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు.

వారి కుటుంబ సభ్యుల కోసం కూడా బీసీసీఐ ప్రయత్నిస్తోంది.ఒకవేళ ఆటగాళ్లకు పాజిటివ్ వస్తే వారు ఇంగ్లాండ్ కి వెళ్లడం ఉండదు.

మొత్తం సిరీస్ కు దూరం అవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube