భారత్ పాకిస్తాన్ యుద్ధాల చరిత్ర ఎవరెన్ని గెలిచారంటే  

The Brief History Of All India Pakistan Wars-

దేశాల మధ్య శతృత్వం అనగానే భారత్ పాకిస్తాన్ గుర్తుకువస్తాయి మనకు.ఇంతకంటే దారుణమైన సంబంధాలు ఉన్న దేశాలు లేవని కాదు, కాని మనకు తెలిసినంతవరకు పాకిస్తాన్ ఒక బద్ద శతృవు.ఏ విషయంలో అయినా సరే, భారత్ పాకిస్తాన్ కి ఒక్క అంగుళం కూడా చిన్న కాకూడదు అని తపనపడతాం.

ఇండియా ప్రపంచకప్ ఓడిపోయిన ఫర్వాలేదు కాని పాకిస్తాన్ తో క్రికేట్ మ్యాచ్ మాత్రం ఓడిపోకూడదు అని ఈగో పెంచేసుకుంటాం.సినిమాల్లో మన హీరోలు పాకిస్తాన్ తీవ్రవాదులపై ముష్ఠిఘాతాలు కురిపిస్తే మురిసిపోతాం.

The Brief History Of All India Pakistan Wars- Telugu Viral News The Brief History Of All India Pakistan Wars--The Brief History Of All India Pakistan Wars-

ఎందుకంటారు? పాకిస్తాన్ శతృవు కాబట్టి అంత పట్టింపు సరే, కాని శతృత్వం ఎందుకు? అసలు ఇది ఎలా మొదలైంది? ఎలా యుద్ధాలకు దారితీసింది? భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఎందుకు జరిగిగాయి? ఎవరెన్ని గెలిచారు? ఈ చరిత్ర మొత్తాన్ని కొంచెం క్లుప్తంగా వివరిస్తాం, చదవండి.

The Brief History Of All India Pakistan Wars- Telugu Viral News The Brief History Of All India Pakistan Wars--The Brief History Of All India Pakistan Wars-

ఇండియా పాకిస్థాన్ మధ్య గొడవలకి ప్రధాన కారణం కష్మీర్ అని మనందరికి తెలుసు.ఇరు దేశాల మధ్య దశాబ్దాల విభేదాల కారణంగా మూడు యుద్ధాలు జరగగా, 1971 లో జరిగిన యుద్ధం మాత్రం ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగింది.

ఇప్పుడు ఈ నాలుగు యుద్ధాల గురించి తెలుసుకుందాం.

1947 యుద్ధం:

చరిత్రలో బేసిక్స్ తెలిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాని, స్వాతంత్ర్యం దక్కిన తరువాత కూడా కష్మీర్ తో మన హైదరాబాదు రాజుల పాలనలో ఉండేవి.ఈ నగరాలురాష్ట్రాల మీద బ్రిటిష్ ఇండియా అధికారం ఉండేది కాదు.కాని అంతర్గతంగా అవి భారతదేశంలో భాగాలే.

హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ఉండటంతో కన్ను పడలేదు కాని, కష్మీర్ కూడా తమకే కావాలంటూ ఆశపడింది పాకిస్తాన్.అప్పుడు కష్మీర్ మరియు జమ్ము రాజా హరి సింగ్ పాలనలో ఉండేవి.రాజు హిందువు అయినా, ఈ ప్రాంతాల్లో ముస్లీం జనాభే ఎక్కువ ఉండేది.

స్వాతంత్ర్యం అనంతరం జమ్ము మరియు కష్మీర్ ని ఇండియాలో కలపాలా లేక పాకిస్తాన్ లోనా అనే అధికారం రాజు చేతిలోనే పెట్టారు‌.రాజు ఆలోచనలో ఉండగానే అప్రమత్తమైన పాకిస్తాన్, తన సైన్యాన్ని పంపించి, మతం పేరుతో స్థానికులని మభ్యపెట్టి, రాజమీదకు దాడికి దిగింది.

దాంతో హరి సింగ్ భారత సైన్యం సహాయం తీసుకున్నాడు.అప్పుడే భారత్ పాకిస్తాన్ ల మధ్య కష్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది.రాజు జమ్ము కష్మీర్ మొత్తాన్ని భారతదేశంలో విలీనం చేసినా, కష్మీర్ లో ఉత్తర భాగాన్ని చాలావరకు ఆక్రమించేసింది పాకిస్తాన్.

దీన్ని POK అంటే Pakistan Occupied Kashmir అని అంటారు.1961 లో చైనాతో జరిగిన యుద్ధంలో జమ్ము మరియు కశ్మీర్ లో మరో భాగం అక్సాయ్ చిన్ ని కోల్పోయింది భారత్.ఇక్కడినుండి మొదలు, భారత్ పాకిస్తాన్, భారత్ చైనాల మధ్య విభేదాలకి కేంద్రబిందువుగా మారింది కశ్మీర్.

1965 యుద్ధం:

1965 లో మరోసారి కశ్మీర్ పై ఆక్రమణ కోసం దండెత్తింది పాకిస్తాన్.అప్పటికి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటూ రెండు భాగాలుగా ఉండేది ఆ దేశం.

ఆపరేషన్ గిబల్టర్ పేరుతో తన సైన్యాన్ని అక్రమంగా పంపించింది పాక్.భారత్ వెస్ట్ పాకిస్తాన్ మీద ఎదురుదాడి మొదలుపెట్టింది.రెండొవ ప్రపంచ యుద్ధం తరువాత అతి పెద్ద ట్యాంక్ వార్ అయిన ఈ యుద్దం 17 రోజులపాటు కొనసాగింది.ఇరువైపులా వేలమంది ప్రాణాలు వదిలారు‌.

యుద్ధం తీవ్రతరం అవుతుండటంతో సోవియట్ యూనియన్ తో పాటు అమెరికా శాంతియుతంగా కలుగజేసుకోని యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేసాయి.ఇరు దేశాలు యుద్ధ విరమణ పత్రాలపై సంతకాలు చేసాయి.గెలుపు మాదే లేదు మాదే అంటూ ఇరుదేశాలు ప్రకటనలు జారిచేసాయి.

మూడొవ ప్రపంచ యుద్ధానికే దారి తీసేంత తీవ్రత కశ్మీర్ లో ఉన్నట్టు అర్థం చేసుకున్నాయి ప్రపంచదేశాలు.

1971 యుద్ధం:

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బెంగాల్ ప్రాంతాన్ని మతప్రాతిపదిక మీద ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ గా విభజించారు.ఈస్ట్ బెంగాల్ ని పాకిస్తాన్ లో విలీనం చేసారు.

అది కాస్త ఈస్ట్ పాకిస్తాన్ అయ్యింది‌.కాని బెంగాల్ భాషోద్యమం, పాకిస్తాన్ ప్రభుత్వం మీద అసంతృప్తి, ఈ రెండు కారణల మూలన ఈస్ట్ పాకిస్తాన్ లో తిరుగుబాటు అలజడి మొదలైంది‌.పాకిస్తాన్ సైన్యం తో అణచేసే ప్రయత్నం చేసింది.

దాదాపుగా కోటిమంది బెంగాలీలు భారత్ తో తలదాచుకున్నారు.భారత్ బెంగాలీలకి సహాయం చేస్తూ పాకిస్తాన్ మీద ఎదురుదాడికి దిగింది.ఈ యుద్ధంలో పాకిస్తాన్ లోని సింధ్, పంజాబ్ తో పాటు పాకిస్తాన్ కశ్మీర్ ని కూడా కొంత ఆక్రమించుకున్న భారత్, ఆ తరువాత జాలితో వెనక్కి తిరిగి ఇచ్చేసింది.

భారత్ దాడికి తలవంచిన పాకిస్తాన్ 16 డిసెంబరు 1971 లో ఓటమిని ఒప్పుకోని బంగ్లాదేశ్ కి స్వతంత్రాన్ని ఇచ్చింది‌.ఈ యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది.నౌకాదళం సగం, వాయిదశంలో పావు సైన్యాన్ని కోల్పోయిన పాకిస్తాన్ లక్షమంది సైనికులని కూడా కోల్పోయింది.

చరిత్రలో పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని పీడకల ఈ యుద్ధం.

1999 యుద్ధం:

ఇదే కార్గిల్ యుద్ధం.మరోసారి LOC (Line of Control) ని దాటి భారత్ లో చొచ్చుబడే ప్రయత్నం చేసింది పాక్‌.కార్గిల్ జిల్లాలోకి పాక్ సైన్యం చొరబడింది.

ఇది మరీ పెద్ద యుద్ధం కాకపోయినా, రెండు నెలల పాటు కొనసాగింది.ఎదురుదాడి కి దిగిన భారత్ మెల్లిగా, పాక్ ఆక్రమించన దాంట్లో 80% తిరిగి చేజిక్కించుకోగలిగింది‌.ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ తీరుపై విమర్శలు గుప్పించడమే కాదు, సైన్యాన్ని వెనక్కి తీసుకోవాల్సింది కోరింది.

దాంతో ప్రపంచ దేశాలు తమని వెలివేస్తాయేమో అనే భయం పాకిస్తాన్ లో మొదలైంది.సైన్యాన్ని వెనక్కి తీసుకున్నా, అప్పటికే తీవ్ర నష్టం చవిచూసింది.4,000 వేలకు పైగా పాక్ సైనికులు మరణించారు.వారి మృతదేహాల్ని కూడా పాక్ వెనక్కి తీసుకోలేదు పాక్.

ఈ యుద్ధాన్ని కూడా గెలిచిన భారత్, మరోసారి పాకిస్తాన్ కుతంత్రాలని విఫలం చేసింది భారత్.

ఇవి ఎక్కువగా ప్రచారం పొందిన పెద్ద యుద్ధాలు మాత్రమే.ఇవి కాకుండా చాలాసార్లు చిన్న పెద్ద ఘర్షణలు జరిగాయి.

మొన్నటికి మొన్న జరిగిన సర్జికల్ స్ట్ఐక్స్ ఆ కోవకు చెందినవే.అణ్వస్త్రల మీద, జలాల మీద, తీవ్రవాదం మీద, ముఖ్యంగా కశ్మీర్ మీద, ఇప్పటికీ, బహుషా ఎప్పటికీ భారత్ పాకిస్తాన్ ల మధ్య ఈ దెబ్బలాటలు జరిగుతూనే ఉంటాయి.