బాబోయ్ ఇదేం విడ్డూరం.. అబద్దం చెప్పారని పెళ్ళి ఆపేసిన వధువు!

పెళ్లి అనేది రెండు మనుషులను కలిపేది మాత్రమే కాదు.రెండు కుటుంబాలను ముడి వేస్తుంది.

 The Bride Who Stopped Wedding For Lying, Khammam, Bride, Crime News, Khammam Mar-TeluguStop.com

ఆ జంట అన్యోన్యంగా ఉండాలని ఆసిస్తూ పెద్దవారు పిల్లలకు పెళ్లి చేస్తారు.కానీ కొన్ని పెళ్లిళ్లు మధ్యలోనే పెటాకులు అవుతూ ఉంటాయి.

అయితే మరికొన్ని పెళ్ళిళ్ళు మాత్రం పీటల దాకా వచ్చి ఆగిపోతాయి.అందుకు చాలా కారణాలే ఉంటాయి.

చిన్న చిన్న గొడవలు కూడా కొన్నిసార్లు పెళ్లి ఆగిపోవడానికి కారణం అవుతాయి.

అయితే మన పెద్ద వారు ఎన్ని అబద్దాలు ఆడి అయినా పెళ్లి చేయాలనీ చెప్తూ ఉంటారు.

అలానే కొంతమంది పెళ్లి అవ్వడం కోసం అబద్దాలు చెప్తూనే ఉంటారు.అయితే తాజాగా ఒక పెళ్లి చిన్న అబద్దం కారణంగా ఆగిపోయింది.ఇంతకీ వారు చెప్పిన ఆ అబద్దం ఏమిటో తెలుసా.వరుడు డిగ్రీ చదివాడని పెళ్లి కూతురు వాళ్లకు అబద్దం చెప్పారట.

కానీ ఆ అబద్దం కారణంగా పెళ్లి ఆగిపోతుందని వారు అస్సలు అనుకోలేదు.

కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.

తన కాబోయే భర్త డిగ్రీ పూర్తి చేయలేదని నిచ్చితార్ధం జరుగుతుండగా మధ్యలోనే ఆపేసింది.

Telugu Tech, Stopped, Groom Degree, Khammam, Vaira, Vallapuram-Latest News - Tel

ఈ ఘటన వైరా మండలం వల్లాపురంలో జరిగింది.ఆ యువతి బిటెక్ చదివింది.అతడు డిగ్రీ చదివినట్టు పెళ్లి కుదిరిన సమయంలో వరుడి బంధువులు చెప్పారు.అందుకనే ఆ యువతి పెళ్ళికి ఒప్పుకుంది.కానీ తీరా నిశ్చితార్ధం పెట్టుకున్నాక అసలు విషయం తెలిసింది.

వరుడు డిగ్రీ చదవలేదని నిశ్చితార్ధం జరుగుతున్న సమయంలో వధువుకు తెలిసింది.అందుకే వధువు నిశ్చితార్ధం జరుగుతుండగా మధ్యలోనే ఆపేసింది.

మోసం చేసి పెళ్లిని కుదిర్చుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఇరువురు కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిచి మాట్లాడారు.

పోలీసులకు బయట చర్చించు కుంటామని చెప్పి వచ్చి ఒకరిని ఒకరు దూషించుకుంటూ గాయపరుచు కున్నారు.దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube