పెళ్లి చేసుకున్న భర్త ఇంటిలోనే ఫస్ట్ డే దొంగతనం చేసిన వధువు..!!

సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అయితే చాలా వరకు డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు.

 The Bride Who Stole The First Day At Home From Her Married Husband, Peddapappuru-TeluguStop.com

పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆ పెళ్లి పెటాకులు అవుతున్న పరిస్థితి.దీంతో ఆటు ఆడపిల్ల ఇటు పెళ్లి చేసుకున్న మగ వాడు కూడా సమాజానికి చాలా ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి అయిన మొదటి రోజే భర్త ఇంటి నుండి వధువు నగదు నగలు తీసుకుని పారిపోవటం సంచలనం సృష్టించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.

ఇతనికి ఇద్దరు సంతానం.ఇలాంటి తరుణంలో పిల్లల సంరక్షణ కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన కేశవ మురళి శ్రీ రెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను మా ఊరి పెద్దల సాక్షిగా వివాహం చేసుకోవడం జరిగింది.

అయితే వివాహం జరిగిన మరుసటి రోజే భరత ఇంటికి కాపురానికి వచ్చిన వధువు భర్త ఇంటిలో ఉన్న బంగారు నగలు మరియు 80 వేల రూపాయలు తీసుకుని పారిపోయింది.వెంటనే కేశవ మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రియుడితో కలసి ఒడిషాలో ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube