పెళ్ళైన పది రోజులకే 8 నెలల గర్భవతి అయిన పెళ్లి కూతురు... అవాక్కయిన భర్త ...

పూర్వ కాలంలో కొందరు పెద్దలు వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి జరిపించాలని చెప్పిన సామెత ఇప్పటికీ జనాలకి బాగానే గుర్తుంటుంది.దీంతో ఈ మధ్య కాలంలో కొందరు ఈ సామెతని చాలా సీరియస్ గా తీసుకుని ఆడరానటువంటి అబద్ధాలు ఆడుతూ, చేయరానటువంటి మోసం చేస్తూ పెళ్లిళ్లు చేస్తున్నారు.

 The Bride Who Is 8 Months Pregnant Just Ten Days After The Wedding-TeluguStop.com

దీంతో నూతన వధూవరుల జీవితాలు ఆదిలోనే చిక్కుల్లో పడుతున్నాయి.కాగా తాజాగా ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురు 8 నెలల గర్భవతి అనే విషయాన్ని దాచి పెళ్లి చేయడంతో చివరికి పెళ్లి అయిన పది రోజుల తర్వాత ఈ విషయం తెలిసి పెళ్ళికొడుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని “బరేలీ” పరిసర ప్రాంతంలో ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.కాగా ఈ యువకుడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ఫుట్ వేర్ సంస్థలో పని చేస్తున్నాడు.

 The Bride Who Is 8 Months Pregnant Just Ten Days After The Wedding-పెళ్ళైన పది రోజులకే 8 నెలల గర్భవతి అయిన పెళ్లి కూతురు… అవాక్కయిన భర్త …-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే ఓ యువకుడి కుటుంబ సభ్యులు యువకుడికి పెళ్లి చేయాలని తమ గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి మరో గ్రామంలో నివాసం ఉంటున్న యువతితో పెళ్లి చేశారు.ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది.

అయితే ఇటీవలె యువతికి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు.వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు చెప్పిన మాటలకు ఒక్కసారిగా వరుడు అవాక్కయ్యాడు.

ఇందులో భాగంగా వైద్యులు యువతి 8 నెలల గర్భవతి అని తేల్చి చెప్పారు.దీంతో యువకుడు తన భార్యను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి జరిగిన విషయం చెప్పాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా యువతి తన ప్రియుడి గురించి పోలీసులతో చెప్పింది.

ఇందులో భాగంగా తాను గత రెండు సంవత్సరాలుగా వేరే యువకుడిని ప్రేమిస్తున్నానని దాంతో తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని అందువల్లనే తాను గర్భవతి అయినప్పటికీ తన నోరు మూయించి తన భర్తతో పెళ్లి చేశారని తెలిపింది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలతో ఆటలాడుతున్నారని అలాగే తమ పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకోకుండా ఇతరులకు బలవంతంగా కట్టబెట్టి ఇరువురు జీవితాలను నాశనం చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు

.

#Pregnant #Pregnant #Pregnant #Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు