సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక పెళ్లి వీడియోలు దర్శన మిస్తూనే ఉంటున్నాయి.పెళ్ళిలో ఏ చిన్న విషయం జరిగిన అది నెట్టింట వైరల్ అవ్వడం కామన్ అయి పోయింది.
అయితే ఈ వీడియోల్లో కొన్ని ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని కామెడీగా ఉంటున్నాయి.ఇలాంటి వీడియోలను నెటిజెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా పెళ్ళిలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్య పోతారు.
ఒక జంట చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు.ఇంతకీ వీళ్ళు ఏం చేసి ఉంటారా.
అని ఆలోచిస్తున్నారా.ఈ మధ్యనే వాళ్ళ పెళ్లి జరిగింది.
వాళ్ళ పెళ్ళికి రాలేదని ఆ జంట ఒక వ్యక్తి 240 డాలర్ల ఫైన్ వేసింది.ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
పెళ్ళికి వెళ్లకపోతే ఫైన్ ఎందుకు వేసారా అని ఆలోచిస్తున్నారా.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఎవరినైనా పెళ్ళికి పిలిచి వారిని సాదరంగా ఆహ్వానించి వాళ్లకు దగ్గరుండి అతిధి మర్యాదలు చేస్తాము.కానీ ఈ జంట మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు.
పెళ్ళికి పిలిస్తే రాలేదని ఒక వ్యక్తికి ఫైన్ విధించారు.ఈ కొత్త జంట చేసిన పనికి ఆ వ్యక్తితో పాటు అందరు షాక్ అవుతున్నారు.ఈ జంట ఆ వ్యక్తికి 240 డాలర్లు (17,700) చెప్పించాలని బిల్ పంపించారు.
వీళ్ళు ఎందుకు ఇలా చేసారంటే.వాళ్ళ రెసెప్షన్ కు ఒక వ్యక్తిని జంటగా రమ్మని ఆహ్వానించారు.వాళ్ళు కూడా వస్తామని ఒప్పుకున్నారు.
దీంతో వాళ్ళిద్దరి కోసం ఈ జంట రెండు సీట్లను రిజర్వ్ చేసారు.ఇందుకు ఒక్కో సీటుకు 120 డాలర్లు అయ్యిది.
వీరు రెసెప్షన్ కు రాకపోవడంతో ఈ సీట్లకు అయినా కహ్ర్చు చెల్లించాలని ఇన్వాయిస్ పంపించారు.
ఈ బిల్లు చెల్లించేందుకు నెల రోజు గడువు ఇస్తున్నామని కూడా అందులో తెలిపారు.
ఈ బిల్లుకు ‘No Call.No Show guest’ అనే టైటిల్ పెట్టారు.పేష్టుహం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మరి ఇలా ఎలా చేస్తారని కొంతమంది అంటుంటే.ఇలా కూడా చేస్తారా అని ఈ పోస్ట్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.