ఈ వ‌ధువు అద్భుత‌మైన డ్యాన్స్ చేస్తూ.. చివ‌ర‌కు భ‌ర్త‌కు స‌ర్ ప్రైజ్ ఇచ్చింది

ఈ మ‌ధ్య పెండ్లి అంటేనే డ్యాన్స్ అనేది చాలా కామ‌న్ అయిపోయింది.ముఖ్యంగా పెండ్లిలో డ్యాన్సు వీడియోలు ఎంతలా వైర‌ల్ అవుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

 The Bride Dances Wonderfully And Finally Gives A Surprise To Her Husband  Bride-TeluguStop.com

పెండ్లి అంటే ఒక‌ప్పుడు చాలా ప‌ద్ధ‌తిగా జ‌రిగేవి.ఇప్పుడు కూడా ప‌ద్ధ‌తిగానే జ‌రుగుతున్నాయి.

కానీ ఫ్యాష‌న్, ట్రెండింగ్ అనేవి వ‌చ్చి వాలాయి.వీటితో ఒక్క‌సారిగా అంద‌రూ ట్రెండ్ అనేది ఫాలో అయిపోతున్నారు.

ఒక చోట ఏదైనా ఫేమ‌స్ అయిందంటే చాలు దాన్నే అంద‌రూ పాటిస్తున్నారు.కొంత కాలం క్రితం పెండ్లిలో బుల్లెట్ బండి పాట‌కు అమ్మాయి డ్యాన్స్ చేస్తే ఎంత‌లా వైర‌ల్ అయిందో తెలిసిందే.

కాగా ఆ త‌ర్వాత పెండ్లిల‌లో వ‌ధువులు అంద‌రూ అదే పాట‌కు డ్యాన్స్ చేయ‌డం కూడా క‌నిపించింది.దీంతో అది కాస్తా ట్రెండ్ అయిపోయింది.ఎంత‌లా అంటే.పెండ్లి అంటే క‌చ్చితంగా వ‌ధువు డ్యాన్స్ అనేది కామ‌న్ అన్న‌ట్టు మారిపోయింది.

ఈ ట్రెండ్ ఇప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తూనే ఉంది.కాగా ఈ పాట‌కే కాక‌పోయినా.

ఇత‌ర పాట‌ల‌కు డ్యాన్స్ లు చేయ‌డం అనేది మ‌నం చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు కూడా ఓ వ‌ధువు అంద‌మైన డ్యాన్స్ తో కాబోయే భ‌ర్త‌కు స‌ర్ ప్రైజ్ ఇచ్చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ జంట పెండ్లి చేసుకుంటోంది.సబా కపూర్ అనే వ‌ధువు త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను మెప్పించేందుకు డ్యాన్స్ తో దుమ్ము లేపేసింది.మ్యారేజ్ స్టేజి వ‌ద్ద‌కు వ‌స్తుండ‌గా.

త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం ఇందులో మ‌న‌కు క‌నిపిస్తోంది.ఇలా అందంగా డ్యాన్స్ చేస్తూ చివ‌ర‌కు త‌న భ‌ర్త వ‌ద్ద‌కు వెళ్లి.

మోకాళ్ల మీద కూర్చుని రింగ్ ఇచ్చి స‌ర్ ప్రైజ్ చేస్తుంది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

ఎందుకంటే ఎప్పుడైనా అబ్బాయిలే ఎక్కువ‌గా ఇలాంటి ప్ర‌పోజ‌ల్స్ చేస్తుంటారు.కానీ ఇలా అమ్మాయి చేసే స‌రికి అంతా ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube