పులులనే ఆటాడించిన బాతు.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

The Brave Duck That Is Troubling The Tigers Funny Video Details

అడవిలో సింహాల తర్వాత అటువంటి క్రూర జంతువు ఏదంటే అందరూ ఠక్కున పెద్ద పులి అని చెప్పేస్తారు.పెద్ద పులి రియల్ గా చూడడం కాదు కదా దాని పేరు వింటేనే మనలో చాలా మంది ఆమడ దూరం పరుగెత్తుతారు.

 The Brave Duck That Is Troubling The Tigers Funny Video Details-TeluguStop.com

అటువంటి పెద్ద పులి కంటికి మనం కనిపించామంటే ఇక మన వ్యాలిడిటీ అయిపోయినట్లే అని అంతా భావిస్తారు.కానీ ఓ చోట మాత్రం ఓ బాతు నీటి బుడుగులో పెద్ద పులులకు చుక్కలు చూపించింది.

ఎంత ప్రయత్నించినా కానీ తమకు దొరకని బాతును ఎలాగైనా సరే పట్టుకోవాలని చాలా ప్రయత్నించాయి.కానీ ఆ పులులకు నిరాశే ఎదురైంది.ఎలాగంటే…

 The Brave Duck That Is Troubling The Tigers Funny Video Details-పులులనే ఆటాడించిన బాతు.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలకు కొదువే ఉండదు.చాలా రకాల వీడియోలను మనం చూసి ఫుల్ నవ్వుకుంటాం.

కొన్ని వీడియోలను చూస్తే మనకు భయం కూడా కలుగుతుంది.కానీ కొన్ని వీడియోలు మాత్రం సరదాగా నవ్విస్తాయి.

అటువంటి కోవలోకే వస్తుంది ఈ పులి బాతు వీడియో.వీడియోలో ఓ చిన్న బాతు అడవికే పెద్ద అని భావించే క్రూర జంతువులు పులులకు ముచ్చెమటలు పట్టించింది.తనను పట్టుకోవడానికి వచ్చిన చిరుతకు చిక్కకుండా చుక్కలు చూపించింది.

నీటిలో ఉండగా తన ముందు మీ బలం, దిగదుడుపే అని నిరూపించింది.ఎన్ని సార్లు తనను పట్టుకోవడానికి వచ్చినా కానీ తుర్రుమని తప్పించుకుంటూ పులుల సహనానికి పరీక్ష పెట్టింది.తనకు నీటిలో ఉన్నపుడు ఉన్న బలం మీ కంటే చాలా ఎక్కువ అని ప్రూవ్ చేసింది.

వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

#Animals #Brave Duck #Tiger #Animals #Duck

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube