Organ donation  jyotiraditya khanna : ఆ బాలుడి మరణం సైనికుడితో సహా ఆరుగురికి ప్రాణం పోసింది..!

బ్రెయిన్ డెడ్ కావడంతో 14 ఏళ్లకే మరణించిన ఓ బాలుడు ఆర్మీ జవాన్‌తో సహా ఆరుగురి ప్రాణాలకు తిరిగి ప్రాణం పోశాడు.వివరాల్లోకి వెళ్తే.

 The Boy's Death Took The Lives Of Six People Including The Soldier Organ Donatio-TeluguStop.com

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని తన రెసిడెన్షియల్ బిల్డింగ్‌లోని 3వ అంతస్తు పైనుంచి 14 ఏళ్ల జ్యోతిరాదిత్య ఖన్నా కిందపడి మరణించాడు.కింద పడిన తర్వాత అతడి మెదడు, ఛాతీకి బలమైన గాయాలయ్యాయి.

దాంతో ఈ పిల్లాడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు అపోలో డాక్టర్లు గురువారం వెల్లడించారు.

అయితే చిన్నతనం నుంచే ఈ బాలుడు తన అవయవాలను దానం చేయాలనుకునే వాడు.

అయితే 18 ఏళ్లు రాలేదు కాబట్టే తాను ఆర్గాన్ డొనేషన్‌కు అంగీకార పత్రం ఇవ్వలేకపోయాడు.కాగా తల్లిదండ్రులు అతడి కోరిక మేరకే అతడి అవయవాలను దానం చేశారు.

బాలుడి గుండె, ఇతర కీలక అవయవాలను దానం చేసి ఆరుగురికి మళ్ళీ కొత్త లైఫ్ అందించారు.ఇండియన్ ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన 44 ఏళ్ల వ్యక్తిలో ఈ బాలుడు గుండెను అమర్చారు.

జవాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అతని గుండె రక్తాన్ని సరిగ్గా ఇతర అవయవాలకు పంపించలేకపోతుందని ఒక రిపోర్టు వెల్లడించింది.కాగా తాజాగా బాలుడి గుండె అమరచడంతో అతడి ప్రాణాలను కాపాడినట్లయింది.

Telugu Brain, Delhi, Organ-Latest News - Telugu

అసలు ఎప్పుడు చనిపోయాడు అంటే.నవంబర్ 15న జ్యోతిరాదిత్య అంతస్తు పైనుంచి కింద పడ్డాడు.ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హరిద్వార్‌లోని మెట్రో ఆసుపత్రికి తరలించారు.ఆపై బుధవారం పొద్దున పూట ఢిల్లీకి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి బ్రెయిన్‌స్టెమ్ రిఫ్లెక్స్‌లు లేవని తేల్చారు.అనంతరం బాలుడు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు.

ఈ సమయంలో డాక్టర్లు జ్యోతిరాదిత్య అవయవాలను దానం చేయాల్సిందిగా తల్లిదండ్రులకు కోరారు.అందుకు వారు అంగీకరించారు.3 ఆసుపత్రులకు అవయవాలను తరలించేందుకు మూడు గ్రీన్ కారిడార్లను రూపొందించారు.బాలుడి కళ్లను ష్రాఫ్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.

అలా మొత్తంగా ఆరుగురికి ఈ అవయవాలు అందాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube