తన పెంపుడు ఎలుకను చంపిందన్న నెపంతో బాలికను కొట్టి చంపిన బాలుడు...!

కొంతమంది చిన్నచిన్న కారణాలకే అవతలి వారి ప్రాణాలను బలి తీసుకుంటున్న రోజులివి.ఇకపోతే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.

 The Boy Who Beat The Girl To Death Under The Pretext Of Killing His Pet Rat  Juv-TeluguStop.com

చివరికి వారి బంగారు భవిష్యత్తును కూడా అంధకారం చేసుకుంటున్నారు.అసలు విషయంలోకి వెళితే… ఓ అబ్బాయి కోపంతో 11 ఏళ్ల బాలికను అతి దారుణంగా కొట్టి చంపిన సంఘటన మధ్యప్రదేశ్ లోని లసూడియా ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… లసూడియా ప్రాంతంలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక తో పాటు మరో 11 ఏళ్ల బాలుడు కూడా కలిసి ఆడుకుంటున్నారు.అయితే ఈ ఆడుకుంటున్న సమయంలో ఆ బాలుడు ఇష్టంగా పెంచుకున్న ఎలుక చనిపోయి కనపడింది.

ఇక ఆ సమయంలో తాను తనతో పాటు ఆ బాలిక మాత్రమే అక్కడ ఉంది.దీంతో ఇష్టంగా పెంచుకున్న ఎలుకను ఆ బాలిక చంపిందని సదరు బాలుడు అమ్మాయి పై కోపంతో రెచ్చిపోయాడు.

ముందుగా ఆ అమ్మాయితో చిన్న గొడవగా మొదలు పెట్టుకొని, అది కాస్త పెద్దదిగా మారి చివరికి ఆ అమ్మాయి తలపై బండరాయితో బలంగా కొట్టాడు.ఇంకేముంది ఆ అమ్మాయి అక్కడే తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలి పోవడంతో సదరు అబ్బాయి అక్కడినుంచి భయంతో పరారయ్యాడు.

ఇక ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఎంతసేపటికి అమ్మాయి ఇంటికి రాకపోవడంతో తన కోసం వెతకడం మొదలుపెట్టారు.తీర అమ్మాయి పడిపోయిన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది.

దీంతో ఆ బాలుడి పై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సదరు బాలుడిని వెతికి పట్టుకొని పోలీసులు విచారణ జరిపారు.ఇకపోతే ఆ విచారణలో అసలు విషయం ఆ బాలుడు తెలిపాడు.

ఇక చివరగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అధరాలు సేకరించి, బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు పోలీసులు తరలించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ను చేపట్టారు.

బాలిక మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube