Goat Boy Vedio : చలితో వణుకుతున్న మేక కోసం చలిమంట వేసిన బాలుడు.. వీడియో వైరల్

పిల్లలు భగవంతుని స్వరూపం అని పెద్దలు అంటుంటారు.కల్మషం లేకుండా చాలా అమాయకంగా ఉంటారు.

 The Boy Lit A Fire For A Goat That Was Shivering With Cold The Video Went Viral-TeluguStop.com

అందుకే పిల్లలను చాలా మంది ఇష్టపడతారు.చిన్న పిల్లలు చాలా ముద్దుగా, ఆకట్టుకునే పనులు చేస్తుంటారు.

కొన్నిసార్లు వారి చేష్టలు మనల్ని నవ్విస్తాయి.కొన్నిసార్లు వారి అల్లరి మనల్ని కూడా ఇబ్బంది పెడతాయి.

చిన్న పిల్లలు కూడా కొన్నిసార్లు మన హృదయాలను గెలుచుకునే పనులు చేస్తారు.పెద్దలు కూడా వారి పని నుండి గుణపాఠం పొందుతారు.

అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిని చూసిన వారంతా ఆ బాలుడి మంచి మనసును అభినందిస్తున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం అసలే చలి కాలం.

బయటకు వస్తే గజగజ వణుకుతున్నారు.చలి వల్ల ఎంత పెద్ద వారైనా గజగజ వణుకుతూ, కాళ్లూ చేతులూ ముడుచుకుంటుంటారు.

దగ్గరలో ఏదైనా చలి మంట ఉంటే వెంటనే అక్కడికి చేరుకుంటుంటారు.పొద్దున్నే 10 గంటలైనా మంచు వీడకపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న పిల్లవాడు తన ఒడిలో మేక పిల్లను పెట్టుకున్నాడు.ఆ మేక పిల్ల చలికి వణుకుతుందని ఆ బాలుడికి అర్థం అయింది.

వెంటనే చలి మంట వద్దకు మేక పిల్లను పట్టుకుని ఆ బాలుడు వెళ్లాడు.చలి మంట వెచ్చదనాన్ని ఆ మేక పిల్లకు అందించాడు.

దానిని రుద్దుతూ చలికి వణికిపోతున్న మేక పిల్లకు సాయం చేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

చిన్న వయసులోనే ఆ మేక పిల్ల దుస్థితిని గమనించి, దానికి సాయం చేసిన ఆ బాలుడిని పలువురు ప్రశంసిస్తున్నారు.ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఆ బాలుడిలో దయా గుణం బాగా ఎక్కువ ఉందని, చిన్నతనంలోనే ఎంతో మంచి పని చేశాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.గుల్జార్ సాహెబ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube