ఈ స్టార్స్ మొదటి జీతం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు వారు నటించే సినిమాలకు కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నారు.అయితే ప్రతి ఒక్క సెలబ్రెటీ కూడా తమ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు.

 Bollywood Star Heroes First Salary Details,  Bollywood News, Amir Khan Salary, S-TeluguStop.com

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్నవారిలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ అమీర్ ఖాన్, వంటి హీరోలు అందరూ మొదటి స్థానంలో ఉన్నారు.ప్రస్తుతం హీరోలందరూ కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.మరి ప్రస్తుతం ఇంత స్టార్ హోదాను దక్కించుకున్న వీరు కెరియర్ మొదట్లో వారి మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

అమితాబచ్చన్

బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అమితాబచ్చన్ తాను ఇండస్ట్రీలోకి రాకముందు షా వాలెస్ అనే షిప్పింగ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా సరుకు రవాణా బ్రోకర్ గా పనిచేసేవారు.ఈ పని చేస్తున్నందుకు గాను అమితాబచ్చన్ మొదటి నెల సంపాదనగా రూ.500 జీతం పొందాడు.

అక్షయ్ కుమార్

Telugu Akshay Kumar, Amitabbachchan, Amitabhbachchan, Bollywood, Shahrukh Khan-M

అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలోకి రాకముందు చెఫ్ గా పని చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇలా ఈయన చెఫ్ గా చేసినందుకుగాను అక్షయ్ కుమార్ మొదటి సంపాదన రూ.1,500లను పొందాడు.

షారుక్ ఖాన్

Telugu Akshay Kumar, Amitabbachchan, Amitabhbachchan, Bollywood, Shahrukh Khan-M

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరియర్ మొదట్లో పంకజ్ ఉధాస్ కచేరీలో పని చేస్తూ మొదటి నెల వేతనంగా 50 రూపాయలను పొందాడు.

అమీర్ ఖాన్

Telugu Akshay Kumar, Amitabbachchan, Amitabhbachchan, Bollywood, Shahrukh Khan-M

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ నటించిన మొదటి సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్‌లో నటించినందుకు గాను ఆయనకు నెలకు వెయ్యి రూపాయల పారితోషికం ఇచ్చేవారు.ఇలా కెరియర్ మొదట్లో అతి తక్కువ జీతంతో పని చేసిన ఈ సెలబ్రిటీలు ప్రస్తుతం ఒక సినిమాలో నటించాలన్న, ఒక యాడ్ లో నటించాలన్న ఏకంగా కోట్లలో రెమ్యూనరేషన్ పొందుతూ స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube