స్వలింగ సంపర్కుల కోసం బాలీవుడ్ లో సినిమా! హీరోగా ఆయుష్మాన్  

Ayushmann Khurrana To Star In Gay Love Story Shubh Mangal Sequel-

ఆయుష్మాన్ ఖురానా ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం అందరికి తెలుసు.సింగర్ గా, హీరోగా తన టాలెంట్ చూపిస్తూ హిట్స్ కొడుతున్న ఈ హీరో స్పెర్మ్ డోనార్ కథాంశంతో విక్కీ డోనార్ సినిమాతో సక్సెస్ కొట్టాడు.అలాంటి కథ చేయడంతోనే అతని ధైర్యం ఏంటో అందరికి తెలిసింది...

Ayushmann Khurrana To Star In Gay Love Story Shubh Mangal Sequel--Ayushmann Khurrana To Star In Gay Love Story Shubh Mangal Sequel-

తర్వాత అంగ స్థంబన సమస్య ఉన్న వ్యక్తిగా శుభ్ మంగల్ పాండే అనే మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు.తరువాత బ్లైండ్ మ్యూజీషియన్‌గా అంధధన్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం సౌత్ భాషలలో కూడా రీమేక్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక పోలీసు అధికారిగా ఆర్టికల్ 15 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి సత్తా చాటాడు.ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది.ఇలా కెరియర్ లో భిన్నమైన కథలతో సినిమాలు తీసే ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.అందులో ఒకటి తాను స్వలింగ సంపర్కుడుగా నటిస్తున్న శుభ్ మంగల్ పాండేకి కొనసాగింపుగా ‘శుభ్ మంగల్ జ్యాదా పాండే ఒకటి ఇప్పుడు ఈ సినిమా గురించి ఆయుష్మాన్ మాట్లాడుతూ కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్‌లో శుభ్ మంగల్ జ్యాదా పాండే’ సినిమా చాలా ప్రాధాన్యత కలిగింది.

Ayushmann Khurrana To Star In Gay Love Story Shubh Mangal Sequel--Ayushmann Khurrana To Star In Gay Love Story Shubh Mangal Sequel-

స్వలింగ్ సంపర్కుల హక్కుల నేపధ్యంలో కమర్షియల్ సినిమాలు తీయడం చాలా చాలా అవసరం.బహుశా వారి పట్ల పక్షపాతం ఉన్న వారు ఎక్కువగా నేటి సమాజంలో ఉండటం వలన రావడం లేదేమో.ముందు అలాంటి వారు నా సినిమాని కచ్చితంగా చూడాలని ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు.