తోటలోకే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ బాలీవుడ్‌ హీరోయిన్‌..!

ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జుహీ చావ్లా.బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి గ్లామరస్ హీరోయిన్‌గా క్రేజ్ కొట్టేసింది.

 The Bollywood Heroine Who Set Up Her Residence In The Garden-TeluguStop.com

నటన, కామెడీ టైమింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె హిందీతో పాటు పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లోనూ నటించింది.ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

తన పిల్లలు జాహ్నవి, అర్జున్ తాను నటించిన సినిమాలు చూడడానికి ఇబ్బందిపడతారని చెబుతూ ఓపెన్ అయింది జుహీ చావ్లా.ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తాను చేసిన సినిమాలు చూడటానికి వాళ్లు ఇష్టపడరని, వాటిలో తాను నటించిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను చూడరని చెప్పింది.

 The Bollywood Heroine Who Set Up Her Residence In The Garden-తోటలోకే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ బాలీవుడ్‌ హీరోయిన్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కరోనా వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.ఈ హీరోయిన్ కూడా ఇంటికే పరిమితమైంది.

అయితే అది తన ఇల్లు కాదు, తన ఫామ్ హౌస్.

కరోనా ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.

ముంబైలో కూడా పరిస్థితులు బాగా లేవు.అతి దారుణంగా తయారయ్యాయి.

దీంతో ఈ హీరోయిన్ వాడా ఏరియాలో ఉన్న తన తోటలోనే నివాసం ఉంటున్నానని తెలిపింది.ఆక్సిజన్‌ కొరత ముంబైని పట్టిపీడిస్తోంది.

దీంతో ముంబైలోని పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.

ఈ తరుణంలో సీనియర్‌ హీరోయిన్‌ జుహీ చావ్లా మాత్రం ముంబై వాడా రోడ్‌లో ఉన్న తన తోటలోనే ఆఫీస్‌ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు.ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా జుహీచావ్లా తెలియజేసింది. వాడా ఫామ్‌ లో మా కొత్త కార్యాలయం‌.

ఇక్కడ గాలికి, ఆక్సిజన్‌కి ఎటువంటి లోటులేదు.కొత్తగా మేము గోశాల‌, స్టాఫ్‌కి క్వార్టర్స్‌ మరియు అధికంగా పండ్ల మొక్కలను నాటాలని ప్లాన్‌ చేస్తున్నాం” అని జుహీ చావ్లా ట్వీట్‌ చేసి తోటలో కూర్చుని ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది.

ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు ఆ హీరోయిన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

#Juhi Chawla #Coronavirus #Garden #Office

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు