ప‌డ‌వ నిండా జ‌నాలు.. స‌డెన్‌గా బోల్తా.. షాకింగ్‌ వీడియో

ప్ర‌మాదం ఎక్క‌డ జ‌రిగినా స‌రే దాని ప్రభావం మాత్రం కుటుంబాల‌ను చిన్నా భిన్నం చేసేస్తుంది.అది రోడ్డు మీద జ‌రిగినా స‌రే నీళ్ల‌లో జ‌రిగినా స‌రే లేదంటే గాల్లో జ‌రిగినా పోయేవి ప్రాణాలే.

 The Boat Was Full Of People Suddenly It Overturned Shocking Video Details, Boat-TeluguStop.com

అందుకే ఎప్పుడూ అలెర్ట్ గానే ఉండాలి.ఏ కొంచెం పొర‌పాటు జ‌రిగినా స‌రే అందులో ఉన్న వారి ప్రాణాలు మాత్రం గాల్లో క‌లిసిపోయిన‌ట్టే.

ఇలాంటి ప్ర‌మాదాల‌కు సంబంధించిన వార్త‌లు నెట్టింట్లో మ‌నం చాలా సార్లు చూస్తున్నాం.చాలా సార్లు ఇలాంటి వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.

అయితే ఇలాంటి ప్ర‌మాదాల్లో చాలాసార్లు ప్రాణ న‌ష్ట‌మే జ‌రుగుతోంది.

అయితే ఇప్పుడు కూడా ఓ చెరువులో ఇలాంటి హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌నే చోటుచేసుకుంది.

దాన్ని చూస్తేనే గుండెలు క‌రిగిపోతున్నాయి.అంద‌రూ ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లి ప‌డ‌వ‌లో తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

అయితే ఇంకొంచెం సేప‌ట్లో ఒడ్డుకు చేరుకుంటామ‌ని అంద‌రూ ఆనందంగా మాట్లాడుకూంటు వ‌స్తున్నారు.కానీ ఇంత‌లోనే ప్ర‌మాదం వారిని వెంబ‌డించింది.

ప‌డ‌వ‌ బోల్తా ప‌డిపోయింది.దీంతో అందులో ఉన్న 10 మంది గల్లంతయ్యారు.

భింద్ జిల్లాలో ఉండేట‌టువంటి సింధ్ నదిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ జిల్లాకు చెందిన ఓ కుటుంబీకులు బంధువుల‌తో క‌లిసి న‌దికి అవ‌త‌లి వైపు జ‌రుగుతున్న ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లి వ‌చ్చారు.అయితే అంద‌రూ క‌లిసి వెళ్లి శుక్రవారం తిరుగు ప్ర‌యాణం అయ్యారు.కాగా ఇలా అంద‌రూ ఆనందంగా వ‌స్తుండ‌గా.

పడవ బోల్తా ప‌డింది.ఇది గ‌మ‌నించిన ఆ ఒడ్డున ఉన్న వారంతా వారిని కాపాడేందుకు నీటిలోకి దూకారు.

అయితే ఇలా ప‌డిపోయిన 10 మందిలో ఎనిమిది మందిని కాపాడిన‌ట్టు తెలుస్తోంది.మిగ‌తా వారి కోసం గాలిస్తున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

ఈ వీడియో ఇప్పుడు బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీనిపై చాలామంది విషాదాంత‌మైన కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube