కాంగ్రెస్ దూకుడుతో ఆలోచనలో పడ్డ బీజేపీ... వ్యూహం బెడిసికొట్టిందిగా

ప్రస్తుతం హుజూరాబాద్  ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నెలకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఇటు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఇప్పటికే గెలుపు వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నడంలో నిమగ్నమయ్యాయి.

 The Bjp, Which Came Up With The Idea With The Aggression Of The Congress ... The-TeluguStop.com

అయితే బీజేపీ పార్టీ తనకు ఉన్న బలమైన ప్రత్యర్థి టీఆర్ఎస్ అని భావించినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా చాలా దూకుడుగా ముందుకెళ్తుండటంతో బీజేపీ వ్యూహాలు అన్ని బెడిసి కొట్టినట్టు తెలుస్తోంది.అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కూడా పెద్ద ఎత్తున బలం ఉండటంతో అంతేకాక  టీఆర్ఎస్ తరువాత అత్యంత బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని చెప్పకతప్పదు.

ఎందుకంటే ఈటెల టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న సమయంలో ఈటెల రాజేందర్ కు బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్న విషయం విదితమే.అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన బలాన్ని కాపాడుకునే దిశగా ముందుకెళ్తోంది.

అందుకే పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తోంది.అయితే బీజేపీకి హుజూరాబాద్ లో బలం లేదు కాబట్టి కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటే బీజేపీ కి ఓటు శాతం తగ్గే అవకాశం ఉంది.

అయితే  ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడు పెంచడం ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలలో ఏదో ఒక పార్టీకి చాలా వరకు నష్టం జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా  ఉంది.అయితే టీఆర్ఎస్, బీజేపీ ఎవరి ప్రచారాల్లో వారు పూర్తి నిమాగ్నమయినా ఎక్కడో ఓ చోట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ దూకుడు బీజేపీకి లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అనేది తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube