ఈ ఛాన్స్ ను వదిలేది లే అంటున్న బీజేపీ... ఇక సమరమేనా

తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి రకరకాల వ్యూహాలు పన్నుతూ ప్రయత్నిస్తోన్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు ప్రయత్నిస్తున్న బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడటానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నిర్మాణంపై దృష్టి పెడుతూనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచే విధంగా పావులు కదుపుతూ ఉన్న పరిస్థితి ఉంది.

 The Bjp Says It Has Not Given Up This Chance Is It A Struggle Details, Telangana Politics, Bjp Party, Bandi Sanjay, Mp Aravind, Telangana, Nizamabad, Cm Kcr, Bandi Sanjay Arrest-TeluguStop.com

అయితే కరీంనగర్ లో జీవో 317 అరెస్ట్ అంశాన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా బీజేపీ కి అనుకూలంగా ఉపయోగించుకుందామని వ్యూహం పన్నినా ముందుగా ఈ విషయం లీక్ కావడంతో ఇక బండి సంజయ్ రెండు రోజులకే విడుదల అయ్యారు.

అయితే ఇక ఆ ఘటన తరువాత తాజాగా జరిగిన రాళ్ళ దాడి ఘటనకు సంబంధించిన అంశాన్ని బీజేపీ రాజకీయ పటిష్టతకు వినియోగించుకునే అవకాశం ఉంది.

 The BJP Says It Has Not Given Up This Chance Is It A Struggle Details, Telangana Politics, Bjp Party, Bandi Sanjay, Mp Aravind, Telangana, Nizamabad, Cm Kcr, Bandi Sanjay Arrest-ఈ ఛాన్స్ ను వదిలేది లే అంటున్న బీజేపీ#8230; ఇక సమరమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేడు బండి సంజయ్ నిజామాబాద్ లో పర్యటించి గాయపడ్డ కార్యకర్తలను పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సందర్భంగా ఎంపీ అరవింద్  జిల్లా అధికార యంత్రాంగంపై మండిపడ్డారు.

తనపై దాడి జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని జిల్లా కలెక్టర్, సీపీ ఈ ఘటనపై తక్షణమే స్పందించాలని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసీఆర్ కనుసన్నల్లో అధికారులు నడుచుకుంటున్నారని భవిష్యత్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని ఆ విషయాన్ని ప్రతి ఒక్క అధికారి గుర్తుపెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.అయితే ఇక ఈ దాడి అంశంతో ఇటు నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అట్టుడికేలా బీజేపీ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.మరి బీజేపీ రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.

The BJP Says It Has Not Given Up This Chance Is It A Struggle Details, Telangana Politics, Bjp Party, Bandi Sanjay, Mp Aravind, Telangana, Nizamabad, Cm Kcr, Bandi Sanjay Arrest - Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Bandi Sanjay, Bjp, Cm Kcr, Mp Aravind, Nizamabad, Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube