హుజురాబాద్ కు అమిత్ షా ! కేసీఆర్ కు చెక్ పెట్టేలా ?

పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్ది హుజురాబాద్ లో పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ అన్ని రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల నాయకులకు పెరిగిపోతోంది.అందుకే తమ ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ , తమ గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు.

 The Bjp Plans To Hold A Huge Open House With Amit Shah In View Of The Elections In Huzurabad Constituency-TeluguStop.com

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి.ముఖ్యంగా బీజేపీ, టిఆర్ఎస్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా,  టిఆర్ఎస్ నుంచి విద్యార్థి సంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు.ముందుగా టిఆర్ఎస్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించి, ఫలితం తమకు అనుకూలంగా ఉండేలా చేసుకోవాలని భావించినా, ఎన్నికల సంఘం బహిరంగ సభలు ,ర్యాలీలపై ఆంక్షలు విధించడంతో, ఇప్పటికే టీఆర్ఎస్ ఎన్నికల సంఘం అధికారులను కలిసి నిబంధనల విషయంలో సడలింపు ఇవ్వాలని కోరింది.

 The Bjp Plans To Hold A Huge Open House With Amit Shah In View Of The Elections In Huzurabad Constituency-హుజురాబాద్ కు అమిత్ షా కేసీఆర్ కు చెక్ పెట్టేలా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 ఒకవేళ దానికి అనుమతి రాకపోయినా , హుజురాబాద్ నియోజకవర్గంలో కాకుండా వేరే ప్రాంతంలో అయినా బహిరంగ సభ నిర్వహించి పట్టు సాధించాలనే లెక్కల్లో టీఆర్ఎస్, బీజేపీ సైతం అదే ప్లాన్ లో ఉంది .ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుగా ప్లాన్ చేసుకుంది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భారీ బహిరంగ సభ నిర్వహించి, టిఆర్ఎస్ పై విమర్శలు చేయించాలని ప్లాన్ చేశారు.అయితే ఎన్నికల నిబంధనలతో అమిత్ షా తన పర్యటన రద్దు చేసుకున్నారు.

అయితే కెసిఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు,  హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉన్న సమీపనవున్న జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడంతో, బీజేపీ సైతం అదేవిధంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
   

  ఈ సభకు కు అమిత్ షా తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరు కాబోతున్నారని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి.  ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.త్వరలోనే ఈ బహిరంగ సభకు సంబంధించిన తేదీలను ప్రకటించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

#Central #Hujurabad #Hijurabad #Bjp #TRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు