జనసేన బీజేపీ పొత్తు ! పదే పదే గుర్తుచేస్తున్న వీర్రాజు ? 

జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతుందని, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా  రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పదేపదే బీజేపీ నాయకులు చెబుతున్నారు.ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.2024 ఎన్నికల్లో వైసిపి టిడిపిలకు వ్యతిరేకంగానే జనసేన బీజేపీ పోటీ చేస్తాయని, ఎన్నికల సమయంలోనే కలిసి కూర్చుని రెండు పార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని చెబుతున్నారు.అయితే జనసేన విషయంలో ఈ రకమైన ప్రస్తావన ఎక్కువగా తీసుకురావడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

 The Bjp Is Trying To Maintain An Alliance With The Janasena , Bjp, Janasena, Ysr-TeluguStop.com

బిజెపితో పొత్తు విషయంలో చాలా కాలం నుంచి జనసేన అసంతృప్తితో ఉంది అని, ఎన్నికల సమయం నాటికి ఆ పార్టీ ఖచ్చితంగా టిడిపితో పొత్తు పెట్టుకుంటుందనే అంచనాలు బీజేపీలో ఉండడం తోనే జనసేన బయటకు వెళ్ళకుండా ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బీజేపీ విషయంలో ఆయన గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.
 

జాతీయ స్థాయిలో బీజేపీ తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలను ఆయన పరోక్షంగా తప్పుపడుతున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ ఇదే రకమైన వైఖరిని అవలంబించారు.అలాగే రెండు పార్టీలు కలిసి ప్రజా ఆందోళనలు ఉద్యమాలు, చేపట్టేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.ఒంటరిగానే జనసేన ప్రజా పోరాటాలు చేపడుతోంది.బిజెపికి జనసేన దూరం అయితే 2024 ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి దారుణంగా మారుతుందనే భయము ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లో బాగా కనిపిస్తోంది.దీనికి తోడు కేంద్ర బీజేపీ పెద్దలు సైతం జనసేనను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలని తగిన సూచనలు అందించడంతోనే,  వీర్రాజు తో పాటు బీజేపీ ముఖ్య నాయకులంతా జనసేనని ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube