రేవంత్ కోసం బీజేపీ భారీ స్కెచ్ ?

గెలుపు తో వచ్చిన కిక్కుతో తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా ఊపు వచ్చినట్టు గా కనిపిస్తోంది.దుబ్బాకలో అనుకోకుండా బీజేపీ గెలవడంతో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలని గట్టిగానే ప్లాన్ చేసుకుంటోంది.

 The Bjp Is Trying To Get Rewanth Reddy To Join The Bjp,  Bjp, Congress, Dubbaka-TeluguStop.com

ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ బీజేపీ లో యాక్టివ్ రోల్ పోషిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,  కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు కు గ్రేటర్ బీజేపీ బాధ్యతలు అప్పగించేందుకు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.ఇదిలా ఉంటే, గ్రేటర్ లో విజయ కేతనం ఎగుర వేయడం ద్వారా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు దక్కుతుంది అనే విషయాన్ని బీజేపీ అగ్రనేతలు బలంగా నమ్ముతున్నారు.

అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకుని మరింతగా బలపడాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ , ఆ పార్టీని అధికారంలోకి నడిపించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం  ఆయన పార్టీలో చేరితే ఊహించని పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తుందని, అసలు దుబ్బాక ఎన్నికల సమయంలోనే ఆయన బీజేపీలో చేరిపోతారు అని అంతా అంచనా వేసినా, ఆయన సైలెంట్ గా ఉండి పోయారు.

ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, సీనియర్ల సహకారం కొరవడడం, బీజేపీ కి తెలంగాణలో అధికారం దక్కే ఛాన్స్ ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న రేవంత్ పార్టీ మారే విషయమై తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల దగ్గర చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Congress, Dubbaka, Ragunandan Rao, Revanth Reddy-Political

 ఇక బీజేపీ పెద్దలు మాత్రం రేవంత్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు అని,  ఆయనను ఏదో రకంగా పార్టీలో చేర్చుకోవడం ద్వారానే బీజేపీకి అధికారం దక్కుతుందనే అంచనాలో ఉన్నట్లు గా కనిపిస్తోంది.ఇప్పటికే బీజేపీ లోని కొంతమంది సీనియర్ నాయకులతో రేవంత్ మంతనాలు చేసినట్లు గాను ప్రచారం నడుస్తోంది.ఒకవేళ నిజంగానే బీజేపీ తీర్థం రేవంత్ పుచ్చుకుంటే,  కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా,  టిఆర్ఎస్ కు ధీటుగా బీజేపీని ముందుకు తీసుకు వెళ్ళగలరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube