పేర్ల మార్పు పై బీజేపీ హడావుడి ! పట్టించుకునే వారేరి ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ పై పూర్తిగా దృష్టి పెట్టినట్టుంది.బీజేపీ ఏదోరకంగా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు గా కనిపిస్తోంది.

 Bjp Is Putting The Increasing Pressure On Ap Govt In The Latest Way Details, Ap-TeluguStop.com

అందుకే ఎప్పటికప్పుడు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటూ,  వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించే విధంగా వ్యవహారాలు చేస్తోంది.కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

వైసీపీ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మొహమాట పడవద్దని,  టీడీపీ వైసీపీ సమానంగానే చూస్తూ ఇరుకున పెట్టాలని,  ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని,  ప్రజా ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని క్లాస్ పీకారు.ఇక అప్పటి నుంచి ఏపీ బీజేపీ నేతలు వైఖరులను మార్పు కనిపిస్తోంది.

సరికొత్త పంథాలో బీజేపీ  పోరాటం చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.దీనిలో భాగంగానే ఏపీ లోని ప్రధాన నగరాల్లో, ముఖ్యమైన ప్రాంతాలకు ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లను ఇప్పుడు బీజేపీ  తెరపైకి తెలుస్తోంది.

గతంలో పొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు విషయంలో బీజేపీ హడావుడి చేసింది.స్వయంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దీనిపై రాజకీయం మరింత పెరిగేలా కనిపించడం,  కేంద్ర బీజేపీ పెద్దల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న కారణాలతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సైతం టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గారు.ఇప్పుడు అదే విధంగా తమ డిమాండ్లను ఏపీ ప్రభుత్వం నెరవేర్చుతుంది అనే ఆలోచనతో ఏపీబీజేపీ నాయకులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Central Bjp, Somu Veerraju, Tipu Sultan, Ysr Cp-

అందుకే రాజకీయాంగా పేర్ల మార్పు వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ కు పేరు మార్చాలని.అబ్దుల్ కలం పేరు లేక గుర్రం జాషువా పేరు పెట్టాలని బీజేపీ కొత్త డిమాండ్ ను వినిపిస్తోంది.ఈ మేరకు బీజేపీ కీలక నాయకులంతా గుంటూరు నగర కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

జిన్నా టవర్ కు పేరు మార్చాల్సిందే అని,  లేకపోతే దాన్ని  కూల్చివేస్తాము అంటూ,  ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు కూడా చేశారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Central Bjp, Somu Veerraju, Tipu Sultan, Ysr Cp-

అంతేకాదు విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరు కూడా మార్చాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ పేర్లు మార్చడం అనే డిమాండ్లు ద్వారా,  బీజేపీ కి కలిసొచ్చే అంశాలు ఏవీ కనిపించడం లేదు.పేర్ల మార్పు అంశంపై బీజేపీ ఇంతగా డిమాండ్ వినిపిస్తున్నా, ప్రజల్లో కనీస స్పందన కనిపించకపోవడం , వైసీపీ ప్రభుత్వం సైతం ఈ పేర్ల మార్పు అంశంపై పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో బీజేపీ పోరాటం అంతా వృథా ప్రయాసే అన్నట్టుగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube