ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టేస్తున్న బీజేపీ.. బ‌ద్వేల్‌పై కొత్త వ్యూహం

ఏపీలో ఇప్పుడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక పోరు అగ్గి రాజేస్త‌న్న విష‌యం చూస్తూన ఉన్నాం.దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

 The Bjp Is Putting Aside Pawan Decision. A New Strategy On Badwell, Pawan, Ap Bj-TeluguStop.com

ఓ వైపు పోటీలో ఉంటార‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ పార్టీ త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.అంతే కాదు ఎవ‌రూ పోటీ చేయొద్దంటూ కోరుతున్నారు.

మ‌రి జ‌న‌సేన‌, బీజేపీ పొత్తులో న‌డుస్తున్నందున అటుత బీజేపీ ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని గౌర‌వించాలి.ఎందుకంటే గ‌త తిరుప‌తి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఛాన్స్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి బ‌ద్వేల్‌లో త‌మ పార్టీకి అవ‌కాశం వ‌చ్చింది

కానీ రాజ‌కీయ విలువ‌ల కోసం త‌మ పార్టీ త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.

దీంతో దీన్నే బీజేపీ అనుకూలంగా మ‌లుచుకుంటోంది.తాము మాత్రం పోటీకి సిద్ధ‌మే అంటోంది.

బద్వేల్ పోరులో పోటీ చేస్తామ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు బీజేపీ నేత‌లు.ఇక త్వరలోనే త‌మ అభ్యర్ధిని కూడా ప్రకటించి రంగంలోకి దూకుతామంటూ చెప్పేస్తున్నారు.

ఇంకో విష‌యం ఏంటంటే బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్రచారానికి ప‌వ‌న్‌ను తీసుకువస్తారని చెబుతున్నారు కార్య‌క‌ర్త‌లు.అదేంటి అస‌లు ప‌వ‌న్ ఎన్నిక‌లు వ‌ద్ద‌నే త‌ప్ప‌కున్నాడు క‌దా మ‌రి ఎలా వ‌స్తాడ‌నే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

Telugu Ap Bjp, Ap Tdp, Chandra Babu, Jagan, Janasena, Pavan Kalyan, Pawan, Somu

అస‌లు త‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన బీజేపీతో ఆయ‌న పొత్తు కొన‌సాగిస్తారా అనే అనుమానాలు క‌లుగుతున్న వేళ ఆయ‌న ప్ర‌చారానికి ఎలా వ‌స్తారంటూ అడుగుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.కానీ బీజేపీ మాత్రం పవన్ ఎన్న‌టికీ త‌మ‌కు మిత్రుడే అని త‌మ మాట కాద‌న‌డ‌నే ధీమాను వ్య‌క్తం చేస్తోంది.ఎలాగైనా ప‌వ‌న్‌తో ప్రచారం చేయాల్సిందే న‌న్న ఆరాటాన్ని ఏపీ బీజేపీ నేత‌లు చూపిస్తున్నారు.

ఇంకోవైపు పవన్ చెప్పిన‌ట్టు టీడీపీ కూడా పోటీ వద్ద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తోంది.అంటే టీడీపీ మ‌ళ్లీ ప‌వ‌న్‌ను ద‌గ్గ‌ర చేసుకునేంద‌కు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న‌మాట‌.

మ‌రి ప‌వ‌న్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube