ఎప్పుడో ఎన్నికలు ... ఇప్పుడే బీజేపీ హడావుడి ? 

తెలంగాణ బిజెపి 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు చాలా కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోతున్న ఎన్నికల పైన ఫోకస్ పెడుతూనే, రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే వ్యూహాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటోంది.

 The Bjp Is Going To Announce The Names Of The Candidates Who Will Contest In The Upcoming Elections In Advance-TeluguStop.com

ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా , టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సరికొత్త రీతిలో ముందుకు వెళుతోంది.దీనిలో భాగంగానే 2023 లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేసుకుంటోంది.అలాగే ఆ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు కార్యాచరణను రూపొందించింది.2 ఏళ్ల కు ముందే పార్టీ తరఫున ఎవరు పోటీ చేయబోతున్నారనే లిస్టును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

దీనిద్వారా అభ్యర్థులు ముందుగానే టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతారని, ఇప్పటి నుంచే తమ పట్టు పెంచుకునేందుకు ప్రజల్లోకి వెళ్లి  , తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు అనే లెక్కల్లో ఆ పార్టీ ఉంది.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు.

 The Bjp Is Going To Announce The Names Of The Candidates Who Will Contest In The Upcoming Elections In Advance-ఎప్పుడో ఎన్నికలు … ఇప్పుడే బీజేపీ హడావుడి  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ యాత్ర ముగింపు సందర్భంగా దాదాపు 10 మంది అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంలో ఉన్నారట.మొదటగా ప్రకటించబోయే 10 మంది అభ్యర్థులు వివాదాలకు దూరంగా ఉన్నవారు మాత్రమే కాకుండా , ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న వారినే ఎంపిక చేశారట.

ఈ పది నియోజకవర్గాలే కాకుండా,  రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టు త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించగల సమర్ధులైన వారినే రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దింపేందుకు బిజెపి సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం బీజేపీ  రెడీ చేసుకున్న 10 నియోజకవర్గాలు ఇవే.
 

Telugu 2023 Elections, Bandi Sanjay, Bjp, Etela Rajender, Telangana Bjp, Telangana Cm, Telangana Elections, Trs-Telugu Political News

  చార్మినార్ , నాంపల్లి, నర్సాపూర్, కార్వాన్ -అమర్ సింగ్ గోషామహల్ – రాజా సింగ్, వికారాబాద్ – మాజీ మంత్రి చంద్రశేఖర్, ఆందోల్ – మాజీ మంత్రి బాబు మోహన్, దుబ్బాక – రఘునందన్ రావు, ఎల్లారెడ్డి – మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , హుజురాబాద్ ఈటెల రాజేందర్. 

#Telangana Cm #Telangana BJP #Etela Rajender #Bandi Sanjay #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు