నిరుద్యోగులే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ  

తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలలో అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది.ఇక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగి తెలంగాణ ఏర్పడింది.

TeluguStop.com - The Bjp Is Formulating Strategies To Target The

తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఇప్పటికీ రెండు పర్యాయాలు జరిగినా నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం చేపపట్టలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అదే విధంగా నిరుద్యోగులలో కూడా కొంత అసంతృప్తి ఉంది.వయస్సు మించిపోతోందని, ఇక తరువాత నోటీకేషన్లు విడుదల చేసినా ప్రయోజనం లేదని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

TeluguStop.com - నిరుద్యోగులే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా ఉద్యమాన్ని బలంగా నడిపించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.ఈ పరిస్థితులలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాడాలని తద్వారా యువతకు కొంత మేర దగ్గరయ్యే అవకాశం ఉండడంతో నిరుద్యోగుల ఆవేదన ఎక్కడ వినబడ్డా బీజేపీ వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే విధంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

తద్వారా యువతకు తమకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసాను పెద్ద ఎత్తున వారికి కలిగించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ఈ వ్యూహం మరి బీజేపీకి ఎంత మేర లాభం చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.

#Bandi Sanjay #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు