ఇక ఏపీ మంత్రులే బీజేపీ టార్గెట్ ? 

బిజెపి వైసిపి మధ్య వైరం తప్పదనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఏపీ బీజేపీ నేతలు దూకుడు పెంచారు.వైసీపీ మంత్రులే టార్గెట్ గా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ,  అనేక ఆరోపణలు చేస్తున్నారు.

 The Bjp Is Completely Targeting The Affairs Of Ap Ministers-TeluguStop.com

జగన్ ప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శిస్తున్నా, కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతో కేంద్రం అంశాన్ని ప్రస్తావించి వైసిపి ఇరుకున పెడుతోంది అని భావిస్తున్న ఏపీ బీజేపీ నేతలు పూర్తిగా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి , దాని ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి పై చేయి సాధించాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది.దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ మంత్రి పై విమర్శలు చేశారు.

ఓ మంత్రికి ఓ అధికారి 3 కోట్లతో బిల్డింగ్ కల్పిస్తున్నారని సోము వీర్రాజు సంచలన విమర్శలు చేశారు.

 The Bjp Is Completely Targeting The Affairs Of Ap Ministers-ఇక ఏపీ మంత్రులే బీజేపీ టార్గెట్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ మంత్రి ఎవరు అనేది వీర్రాజు చెప్పకపోయినా,  వెంటనే ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి తనకు ఎవరూ బిల్డింగ్ కట్టించి ఇవ్వలేదని , కావాలంటే దీనిపై సిబిఐ విచారణ చేసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు.

అయితే కొడాలి నాని పేరు ప్రస్తావించకపోయినా, ఆయన హడావుడి పడుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో వీర్రాజు చేసిన ఆరోపణలు కొడాలి నాని ని ఉద్దేశించినవే అనే విషయం జనాల్లోకి వెళ్లింది.ఈ కారణంగా వైసిపి అభాసుపాలు కావలసి వచ్చింది.

ఓ మంత్రి విషయంలోనే వైసిపి ఇరుకున పడడం , బీజేపీకి కలిసి రావడంతో ఇక ఏపీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై దృష్టి పెట్టి , ఆ అంశంపైనే స్పందించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం హవా తగ్గించవచ్చని, బిజెపి మైలేజ్ పెంచుకునేందుకు ఈ వ్యవహారాలు కలిసివస్తాయి అనే ఆలోచనలో వీర్రాజు ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Ap, Ap Government, Ap Ministers, Bjp, Jagan, Kodali Nani, Somu Veerraju, Ysrcp-Telugu Political News

జగన్ బిజెపి విషయంలో సీరియస్ గా ఉండడం,  కేంద్రంతో విభేదించేందుకు సిద్దమవుతుండటంతో ఏపీ బిజెపి నేతలు జగన్ విషయంలో విమర్శలు తీవ్రతరం చేసినట్లు కనిపిస్తున్నారు.ఇక మంత్రులు,  ఎమ్మెల్యేల కు సంబంధించిన అన్ని వ్యవహారాలు పైన విమర్శలు చేయడమే కాకుండా,  సాక్షాలతో సహా తమ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలనే ఎత్తుగడలో బిజెపి ఉన్నట్లుగా అర్థం అవుతోంది.

#Kodali Nani #Ap Ministers #Ysrcp #Jagan #AP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు