ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుపై బీజేపీ గురి

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొంది.అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీగా అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందుతుందని భావించారు.

 The Bjp Is Aiming For Victory In The Mlc Elections Bjp Party, Telangana Politics-TeluguStop.com

కాని అన్ని చోట్ల బీజేపీ గెలిచే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ లు వెలువడ్డాక చాలా మంది ఆశావాదులు ఎమ్మెల్సీ టికెట్ ను ఆశించారు.

కాని అయితే కొంత మందికి మాత్రం వచ్చే రోజుల్లో రకరకాల రూపంలో అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవటంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది.

రవీందర్ సింగ్ తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో చాలా దూకుడుగా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Telangana-Political

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా రవీందర్ సింగ్ ను గెలిపించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో బీజేపీ గెలిచి మరలా హుజూరాబాద్ తరహాలో సత్తా చాటాలని భావిస్తున్న పరిస్థితి ఉంది.రవీందర్ సింగ్ ఇప్పటికే తన వైపు చాలా మంది ఎంపీటీసీలను కూడా తన వైపు తిప్పుకున్న పరిస్థితి ఉంది.

అందుకే తాజాగా కేసీఆర్ కూడా ఒకటో రెండో ఎమ్మెల్సీ స్థానాల్లో ఒడిపోతాం అయితే ఏమైనా అవుతుందా అని బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే ఒకవేళ రవీందర్ సింగ్ గెలుపొందితే బీజేపీ ఇక మరో సారి సత్తా చాటామనే రీతిలో సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది.

మరి బీజేపీ సత్తా చాటుతుందా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube