టీడీపీ కి గడ్డు కాలమే... బీజేపీ కి కలిసోచ్చే కాలం ?

ఎప్పటి నుంచో బీజేపీ ఆశపడుతున్న అవకాశం ఇప్పుడు రానే వచ్చింది.అసలు ఏపీలో బీజేపీ బలపడలేకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ,  ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనే విషయం బీజేపీ నేతలకు బాగా తెలుసు.

 The Bjp Believes That They Will Be Strengthened If The Tdp Is Weak  Bjp, Tdp, Ys-TeluguStop.com

ఏపీలో తాము బలం పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలహీనం అవ్వాలని, అప్పుడు మాత్రమే తమకు అవకాశం దక్కుతుందని బీజేపీ ఎప్పటి నుంచో నమ్ముతోంది.ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపి, వైసీపీ పోటీ చేస్తున్నా,  ప్రధాన పోటీ అంతా వైసీపీ బీజేపీ మధ్య ఉండడం, పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించడం ఇవన్నీ తమకు కలిసి వచ్చే అంశాలే అని బిజెపి నమ్ముతోంది.బీజేపీ పరిషత్ ఎన్నికలకు దూరమవడాన్ని ఇప్పుడు బీజేపీ హైలెట్.
చేసుకుంటోంది.

ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని తెలుగుదేశం పార్టీ వైసీపీకి భయపడి పారిపోయిందని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

వైసీపీని ఢీ కొట్టే ఆంత ధైర్యం తమకే ఉందని, అందుకే ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని టీడీపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.ప్రజలు తమను నమ్మినా,  నమ్మక పోయినా తమ పార్టీకి ఓట్లు వేసినా, వేయకపోయినా వైసీపీ కి పోటీ తామేనని,  బీజేపీని బలంగా జనాల్లోకి తీసుకెళ్తామని కమలనాథులు ధైర్యంగా చెబుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయిన తర్వాత మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం విమర్శలు చేశారు.ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ పై ప్రజల్లోనూ చర్చ జరుగుతుందని, ఆ పార్టీ బాగా బలహీన అయిందనే వార్తల నేపథ్యంలో తిరుపతిలో ఈ వ్యవహారాలు తమకు కలిసివస్తాయి అని బీజేపీ ఆశలు పెట్టుకుంది.

Telugu Chandra Babu, Janasena, Pavan Kalyan, Somu Veerraju, Ysrcp-Telugu Politic

వైసీపీ నీ వ్యతిరేకించేవారు అంతా,  తమకు ఓట్లు వేయాలంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది.అలాగే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లో పాదయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీని మరింతగా టార్గెట్ చేసుకుని విమర్శలు ఎక్కి పెట్టాలని బీజేపీ ప్లాన్ చేసుకుంది.టీడీపీ పతనమే తాము బలపడేందుకు అవకాశం కల్పిస్తుంది అని బీజేపీ నమ్మకంతో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube