వైరల్ వీడియో: రోడ్డుపై భాగస్వామిని కోల్పోయిన పక్షి.. దాంతో మిగిలిపోయిన పక్షి..?!

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నామో మనకి తెలుసు.

 Viral Video: The Bird That Lost Its Partner On The Road .. The Bird That Was Lef-TeluguStop.com

నా అన్నా వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళని కడసారి చూపుకి కుడా నోచుకోలేని పరిస్థితిలో మనం అందరం ఉన్నాము.బంధాలు, బాంధవ్యాలు ఇవేమి లేవు.

ప్రాణాలు ఉంటే చాలు అని అనుకుంటున్నారు.మనుషుల్లో మాయం అయిన ప్రేమ, ఆప్యాయతలు ఇంకా జంతువుల్లో, పక్షుల్లో అలానే ఉన్నాయి అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అని చెప్పాలి.

అలాగే మనం ఇంట్లో పెంచుకునే పెట్స్ కూడా మన పట్ల ఎంతో విశ్వాసంగా, ప్రేమగా ఉంటాయి.మనకి ఏ చిన్న కష్టం వచ్చినాగాని అవి విలవిలలాడి పోతాయి.

మనుషులపైనే అలాంటి ప్రేమ చూపించే జంతువులు, పక్షులు ఇంక వాటి భాగస్వాములపై, కడుపున పుట్టిన పిల్లలపై ఎంత ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తాయో మీ అందరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాజాగా ఒక మనసు చలించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు కంట తడి పెట్టకుండా ఉండరు.ఆస్ట్రేలియన్ గాలా పక్షి గా పిలవబడే ఈ పక్షిని పింక్, గ్రే కాకాటూ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

చూడడానికి పింక్ కలర్ లో గాలా పక్షి ఎంతో ముద్దుగా ఉంటుంది.అయితే గాలా పక్షి యొక్క భాగస్వామి రోడ్డు మీద విగత జీవిలా పడి ఉండడం చూసి గుండెపగిలేలా విచారించింది.

తన భాగస్వామిని వదిలి వెళ్లలేక ఆ పక్షి పడిన ఆవేదన అంతా ఇంతా కాదు.ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు కంట తడిపెట్టకుండా ఉండలేరు.

చనిపోయిన భాగస్వామిని వదిలి వెళ్లలేక దాని చుట్టూ తిరుగుతూ ఎంతో ఆవేదన చెందుతుంది.ఆ చనిపోయిన పక్షిని వదిలి వెళ్లలేక చివరికి తన తల ఆ పక్షి దగ్గర ఆనించి విచారిస్తూ వెళ్తున్న ప్రియతమా అని చెప్పి అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది.దూరంగా చాలా పక్షులు అలానే చూస్తూ ఉండిపోయాయి.ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఆ పక్షి ఎలా చనిపోయిందో అనే విషయం తెలియదు కానీ.రోడ్డు మీద అలా పడిపోయింది అంటే ఏదన్నా వాహనం ఢీ కొట్టి ఉంటుందని భావించవచ్చు.

రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళే కొంచెం ఆచి తూచి ప్రయాణం చేయండి.మనుషుల వలె పక్షులు, జంతువులకు కూడా బంధాలు ఉంటాయి.

అవి చనిపోతే మిగిలినవి కూడా ఎంతో బాధ పడతాయి అనడానికి ఈ పక్షి ఒక ఉదాహరణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube