బిల్లు రూ.2500..టిప్పు ఇచ్చింది రూ 1.50 లక్షలు..!!

హోటల్ కి వెళ్తే సర్వర్ కి టిప్పు ఇవ్వడం పరిపాటే ఎవరికీ తోచినట్టుగా వాళ్ళు తమకి సర్వీస్ చేసినందుకు గాను టిప్పు ఇస్తూ ఉంటారు.మహా అయితే 50, కాస్త పెద్ద హోటల్ అయితే 100 వారి వారి స్థాయిని బట్టి టిప్పు ఇస్తూ ఉంటారు.

 The Bill Was Rs.2500 The Tip Was Given Rs.1.50 Lakhs, Hottel Survent Got Gift ,-TeluguStop.com

కానీ అమెరికాకి చెందిన నటుడు, పాప్ సింగర్ అయిన డోన్నీ వాల్ బెర్గ్ మాత్రం టిప్పులకే రారాజు.ఏదోఒక మంచి పని చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే డోన్నీ వాల్ మళ్ళీ వార్తల్లో నిలిచాడు.

ప్రస్తుతం అతడు ఓ హోటల్ లో పనిచేసే వాళ్లకి ఇచ్చిన టిప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…వివరాలోకి వెళ్తే…

అమెరికాలోని మసాచుసెట్స్ లోని మార్షల్ ల్యాండ్ రెస్టారెంట్ కు వెళ్ళాడు.తనకి కావాల్సినవి ఆర్డర్ ఇచ్చాడు.మొత్తం బిల్లు రూ.2500 అయ్యింది.అక్కడ పనిచేసే సిబ్బంది డోన్నీ వాల్ కు బిల్లు అందించగా బిల్లు తో పాటు అతడు అక్కడ పనిచేసే సిబ్బందికి 1.50 లక్షలు టిప్పుగా ఇచ్చాడు.దాంతో ఆ టిప్పు చూసిన హోటల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆ షాక్ నుంచీ తేరుకున్న తరువాత హోటల్ సిబ్బంది డోన్నీ వాల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Telugu Hottel Gift, Marshal, Telugu Ups-Telugu NRI

డోన్నీ వాల్ ఇచ్చిన టిప్పు తాలుకూ బిల్లు ను హోటల్ సిబ్బంది ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.మా సిబ్బందికి ఇంత పెద్దమొత్తం లో టిప్పు ఇచ్చినందుకు హోటల్ తరపున కృతజ్ఞతలు తెలిపింది.ఇదిలాఉంటే డోన్నీ వాల్ తాను ఏ రెస్టారెంట్ కు వెళ్ళిన కళ్ళు చెదిరే టిప్పులు ఇవ్వడం కొత్తేమీ కాదు గతంలో కూడా డోన్నీ వాల్ ఇలాంటి టిప్పులు ఇచ్చి వార్తల్లో నిలిచాడు.

ప్రస్తుతం అతడు ఇచ్చిన టిప్పు తాలుకూ బిల్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube