ఆ అమ్మాయి విషయంలో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. !

కరోనా వచ్చి ఎందరి బ్రతుకులనో చిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే.అలాంటి వారిలో జ్యోతి కుమారి ఒకరు.

 Bihar Government, Sensational Decision, Jyoti Kumari, Brand Ambassador-TeluguStop.com

ఇంతకు ఎవరా జ్యోతి కుమారి అని ఆలోచిస్తున్నారా? కరోనా కష్ట కాలంలో అనారోగ్యం బారిన పడిన తన తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంచలనం సృష్టించింది 15 ఏళ్ల అమ్మాయి పేరే జ్యోతి.

సైకిల్ జ్యోతి కుమారిగా వార్తల్లోకి ఎక్కిన ఈ అమ్మాయి సాహసాన్ని మరచిపోలేం కదా.అలాంటి సాహాసాన్ని ఇన్ని రోజులకు గుర్తించిన బీహర్ ప్రభుత్వం జ్యోతికి అరుదైన గుర్తింపునిచ్చి ‘కంప్లీట్ స్టాప్ అన్ డ్రగ్స్’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా ఆమెకు రూ.50వేల చెక్కును ఒక ట్యాబ్‌ను కూడా బహుమతిగా ఇచ్చారట.ఈ విషయాన్ని సోషల్ సెక్యూరిటీ డైరెక్టర్ దయానిధన్ పాండే ధృవీకరించారు.

ఇక అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చొబెట్టుకుని స్వగ్రామం వరకు తీసుకువచ్చిన జ్యోతి, కన్న వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్న ఎందరో మూర్ఖులకు ఆదర్శం అని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube