బిగ్ బాస్ సిరికి కరోనా పాజిటివ్..!

బిగ్ బాస్ సీజన్ 5తో మోస్ట్ పాపులర్ అయిన సీరియల్ యాక్టర్, యూట్యూబర్ సిరి షో తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది.బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ తో ఆమె చేసిన అతికి బయటకు వచ్చాక చాలా ఇబ్బందులు పడుతుంది.

 Biggboss Season 5 Siri Tested Corona Positive Details, Bigg Boss, Bigg Boss Siri-TeluguStop.com

రీసెంట్ గా షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ చెప్పుకోగా దానికి కారణం కూడా సిరి అంటూ ఆమెని టార్గెట్ చేశారు.అయితే వాటినన్నిటినీ సహిస్తూ వచ్చింది సిరి.

అంతేకాదు ఆమె లవర్ శ్రీహాన్ కూడా సిరిని వదిలి వెళ్లాడని తెలుస్తుంది.శ్రీహాన్, సిరిలు కూడా దాదాపు విడిపోయినట్టే అని చెప్పుకుంటున్నారు.

ఇదిలాఉంటే సిరి తనకు కొవిడ్ పాజిటివ్ అని చెప్పి షాక్ ఇచ్చింది.మైల్డ్ సింటమ్స్ రాగా టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందని.ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ఇన్ స్టాగ్రాం స్టేటస్ లో పెట్టింది సిరి హన్మంత్.అయితే ఆమె ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఎలా ఉన్నా బిగ్ బాస్ సీజన్ 5 ఇంప్యాక్ట్ సిరి, షణ్ముఖ్ ల జీవితాల పై బాగా పడ్డదని మాత్రం అర్ధమవుతుంది.బిగ్ బాస్ సీజన్ 5లో సన్నీ విన్నర్ కాగా.

షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు.సిరి టాప్ 5గా బయటకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube