రెండు పెళ్లిళ్లు చేసుకున్న.. ఇద్దరు భర్తలు హింసించారు: బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెరపై సీజన్లను పూర్తి చేసుకుంటూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఇప్పటికే ఈ కార్యక్రమం హిందీలో 14 సీజన్లను పూర్తి చేసుకోగా తెలుగులో నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.

 Bigg Boss Contestant Sneha Sagh Comments On Her Failed Marriages Details,  Bigg-TeluguStop.com

అదే విధంగా ఈ రియాల్టీ షో మరాఠిలో రెండు సీజన్లలో పూర్తిచేసుకుని మూడవ సీజన్ ప్రసారమవుతుంది.అయితే ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో అందరికన్నా నటి స్నేహ వాగ్‌- నటుడు ఆవిశ్కర్‌ దర్వేకర్‌ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అందుకు గల కారణం గతంలో వీరిద్దరూ భార్యాభర్తలు కావడంతో ప్రేక్షకుల ఫోకస్ కూడా వీరి పై పడిందని చెప్పవచ్చు.

స్నేహ 19 సంవత్సరాల వయసులోనే నటుడు ఆవిశ్కర్‌ దర్వేకర్‌ ను పెళ్లాడింది.

అయితే వీరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు.తన భర్త తనని ఎంతో శారీరకంగా హింసిస్తూ ఉన్నాడంటూ స్నేహ తన భర్తకు విడాకులు ఇచ్చింది.

ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన స్నేహ అనంతరం ఇంటీరియర్ డిజైన్ అనురాగ్ సోలంకి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే ఈ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

కేవలం ఎనిమిది నెలలకే వీరిద్దరూ విడాకులతో విడిపోయారు.

తాజాగా ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఇద్దరు భర్తలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

తన ఇద్దరు భర్తలు తనని ఎన్నో చిత్రహింసలకు గురి చేశారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేసిన స్నేహ వ్యాఖ్యలపై నటి కామ్య పంజాబీ ఘాటుగా స్పందించింది.అసలు నువ్వేం అనుకుంటున్నావు?నీ ఇద్దరు భర్తలు కూడా బిగ్ బాస్ లోకి రావాలని కోరుకుంటున్నావా అంటూ ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీ మొదటి పెళ్లి గురించి నాకు తెలియదు గాని రెండవ పెళ్లి గురించి మాత్రం ఈ విధమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకు ఇలాంటి కథలు అల్లితే నేను వాస్తవాలను బయటకు తీయగలను అన్న సంగతి నీకు తెలుసు ఎంతో చక్కగా ఆటఆడు అంటూ ట్వీట్ చేస్తూ స్నేహ పై కామ్య ఘాటుగా స్పందించారు.ఇలా ఈమె చేసిన ట్వీట్ కి అనురాగ్ తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపడమేకాకుండా తను స్నేహను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆధారాలు రుజువు చేయాలంటూ ఆమెకు సవాల్ విసిరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube