బిగ్ బాస్ హౌస్ లో బ్రేకప్.. సింగర్ శ్రీరామ్ తో ఇకపై తాను మాట్లాడనంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది.తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా ఈ వారం ఎలిమినేషన్ కు పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు.

 The Bigg Boss Episode That Is Going To Take Place Today  Seems To Be Going Funny-TeluguStop.com

సోమవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు అరుచుకోవడంతో పాటు నామినేట్ చేయడం కోసం ఫోటోలను నిప్పుల్లో వేసి షాకింగ్ కామెంట్లు చేశారు.

అయితే తాజాగా బిగ్ బాస్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో వీజే సన్నీ కడుపుబ్బా నవ్వించారు.

మొదట శ్రీరామ్ ను ఇమిటేట్ చేసి చూపించిన సన్నీ ఆ తర్వాత హమీదా ఏ విధంగా గట్టిగా అరిచిందో చేసి చూపించారు.ఆ తర్వాత ఆర్జే కాజల్ శ్రీరామ్ తో బ్రేకప్ బ్రో అని చెబుతారు.

చరిత్రలో బ్రదర్, సిస్టర్ బ్రేకప్ చెప్పుకోవడం ఇదే తొలిసారి అని కాజల్ శ్రీరామ్ తో చెబుతారు.కాజల్ ఆ విధంగా చెప్పడంతో శ్రీరామ్ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు.

ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.ఐన్ స్టీన్ e=mc2 ఫార్ములాను ఎందుకు కనిపెట్టాడో కూడా సులభంగా తెలుసుకోవచ్చని బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్లు మాత్రం అర్థం కావని షణ్ముఖ్ పేర్కొన్నారు.

ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లో శ్వేతా వర్మ గట్టిగా అరిచేశారు.ఇతరులలోని అగ్లీ సైడ్ ను బయటకు తీసుకొనిరావడం గేమా? అంటూ శ్వేత కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ షోకు వారంవారానికి రేటింగ్స్ తగ్గుతున్నాయి.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగినా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండకపోవచ్చని కూడా వార్తలు పచారంలోకి వస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube