ఈ రోజుల్లో సమాజంలో ఒక హోదా కావాలన్నా,గుర్తింపు ఉండాలన్నా చేతిలో డబ్బు పుష్కలంగా ఉండాలి.కొంత మంది వ్యక్తిత్వానికి విలువ ఇచ్చిన చాలా మంది మాత్రం డబ్బు చూసే గౌరవం ఇస్తారు.
డబ్బు కొందరి వద్ద ఎక్కువగాను,కొందరి వద్ద తక్కువగాను ఉంటుంది.అయితే ఇప్పుడు ఏ రాశుల వారి వద్ద డబ్బు ఎక్కువగా నిలుస్తుందో….
ఏ రాశుల వారి దగ్గర డబ్బు నిలవదో తెలుసుకుందాం.
వృషభ రాశిఈ రాశి వారు ఎక్కువగా కష్టపడే తత్త్వం కలిగి ఉండుట వలన సంపద కూడా ఎక్కువగానే ఉంటుంది.
వీరికి చేసే పని అయ్యేవరకు నిద్రపట్టదు.అంతేకాక వీరిలో పొదుపు చేసే గుణం కూడా ఎక్కువే.
కర్కాటక రాశిఈ రాశి వారికీ ఆర్ధిక వ్యవహారాలపై పట్టు ఉండటం వలన రొటేషన్ బాగా చేసి సంపదను భద్రంగా దాస్తారు.వీరు ప్రతి రూపాయిని పొదుపు చేస్తారు.
వీరు ఆర్ధిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
సింహ రాశివీరు ఆర్ధిక పరమైన విషయాలపై అవగాహన ఉండుట డబ్బు విషయంలో ఎప్పుడు నష్టం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
వీరు డబ్బు పొదుపు చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.అలాగే వ్యాపారంలో ఎప్పటికప్పుడు నష్టాలను బేరీజు వేసుకొని నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

కన్య రాశిఈ రాశి వారు ఆర్ధిక వ్యవహారాలపై మంచి పట్టు ఉండుట వలన ఆర్ధికంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.అలాగే డబ్బును పొదుపు బాగా చేస్తారు.వీరికి చాలా వ్యాపారాలపై అవగాహన ఉండుట వలన వాటిలో వచ్చే లాభనష్టాలను బాగా అంచనా వేయగలరు.అందువల్ల వీరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికరాశిఈ రాశి వారు ఆర్ధికవ్యవస్థపై ఎక్కువగా అవగాహన కలిగి ఉండుట వలన ఎక్కువగా పొదుపు చేస్తూ ఉంటారు.వీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు.
వీరు దాదాపుగా ఆర్థికంగా నష్టపోరు.వీరు సంపాదించుకున్న డబ్బు వృధా కాకుండా చూసుకుంటారు.
తులరాశివీరికి ఆర్థిక సమతుల్యం గురించి తెలుసు.అయితే వచ్చిన డబ్బును ఎక్కువగా ఖర్చుచేయడం వల్ల వీరి దగ్గర డబ్బు ఎక్కువగా నిలబడదు.
అలాగే వీరికి డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు కూడా తెలిసి ఉంటాయి.కానీ డబ్బును పొదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండుట వలన వీరి వద్ద డబ్బు నిలవదు.
కుంభ రాశిఈ రాశి వారు డబ్బును బాగానే సంపాదిస్తారు.అయితే షాపింగ్ అంటూ ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
డబ్బును పొదుపు చేసిన సరే మొత్తం ఒకేసారి ఖర్చు చేసేస్తారు.అందువల్ల వీరి చేతిలో డబ్బు కొన్ని సందర్భాలలో ఉండదు.
మీన రాశిఈ రాశి వారికి సంపాదన మార్గాలు పెద్దగా తెలియవు.అలాగే సంపాదించిన డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
వీరు ఎవరికైనా అవసరం ఉందంటే డబ్బు ఇచ్చేస్తారు.ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం అవుతుంది.
ధనస్సు రాశిఈ రాశి వారు డబ్బు కోసం తాపత్రయం ఎక్కువగా ఉంటుంది.వీరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు.
డబ్బు ఉన్నా సరే ఖర్చు పెట్టేసి ఇబ్బందుల్లో పడతారు.
TELUGU BHAKTHI