జగన్ కి అధికారాన్ని కట్టబెట్టే ఏకైక ఆయుధం ఇదొక్కటే..!!!  

The Best Way To Win In This Elections For Jagan-elections,jagan,janasena,pawan Kalyan,political Updates,tdp,the Best Way,win,ycp

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత తెలివైన నాయకుడో రెండు రోజుల క్రిందట అందరికి మరో సారి తేటతెల్లం అయ్యింది. సరిగ్గా ఎన్నికలకి వారం రోజులు ఉందనగా రైతులకోసం విడుదల చేసిన రెండవ విడత మూడు వేల రూపాయల డబ్బులు బాబు కి ఇప్పటివరకూ తగ్గిపోయిన మైలేజ్ ని ఒక్కసారిగా పెంచేశాయి. ప్రతిపక్షాలు పరుగు పరుగున ఎన్నికల సంఘానికి ఈ విషయంలో ఫిర్యాదు చేస్తాయని ముందుగానే ఊహించిన బాబు అందుకు తగ్గట్టుగానే ఈ సొమ్ము విడుదలలో లబ్దిదారులని ముందుగానే గుర్తించి పక్కా ప్లాన్డ్ గా ఈసీ నుంచీ ఎటువంటి అభ్యంతరం లేకుండా రైతుల ఖాతాలలో సొమ్ము జమ చేశాడు..

జగన్ కి అధికారాన్ని కట్టబెట్టే ఏకైక ఆయుధం ఇదొక్కటే..!!!-The Best Way To Win In This Elections For Jagan

దాంతో రైతులు, రైతు కుటుంభాల ఓట్లన్నీ తమ ఖాతాలోకి వచ్చి చేరుతాయనేది బాబు వ్యూహం. అయితే బాబు వ్యూహానికి గండిక్కొట్టే విధంగా ముందు ముందు బాబు ఎలాంటి తాయిలాల ఆశ చూపినా జగన్ వైపే ఏపీ ప్రజలు మొగ్గు చూపే విధంగా జగన్ బ్రహ్మాస్త్రం సిద్దం చేసి ఉంచారట. ఇప్పుడు జగన్ ముందు ఉన్న ఏకైక ఆయుధం ఇదొక్కటే అంటున్నారు పరిశీలకులు, బాబు ఎన్ని ప్రలోభాలకి పెట్టినా సరే జగన్ ఆయుధం ముందు ఇవన్నీ దిగదుడుపే అంటున్నారు.

ఇంతకీ ఏమిటా బ్రహ్మాస్త్రం.??? అంటే…

ఒక్క చాన్స్.ఇదే ఇప్పుడు జగన్ ని గట్టెక్కించే మంత్రం, బ్రహ్మాస్త్రం. ఏపీలో త్రిముఖ పోరు ఉంటుందని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన కూరలో కరివేపాకే అనే స్థితికి ప్రజలు వచ్చేశారు. దాంతో పోటీ కేవలం జగన్ , బాబుల మధ్యేనని స్పష్టంగా అర్థం అవుతోంది.

ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత ఒక్క చాన్స్ అంటూ జనం ముందుకు వచ్చారు. ఒక్క చాన్స్ ఇచ్చి చూస్తె తన పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని అంటున్నారు. తన తండ్రిని మైమరపించేలా ప్రజా రంజకంగా పాలన చేస్తానని చెప్తున్న జగన్ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలని కోరడం ప్రతీ ఒక్కరిని కదిలిస్తోందని అంటున్నారు..

అయితే జగన్ అంటున్న ఈ ఒక్క మాటకి టీడీపీ తెగ కలవరపడుతోంది. చంద్రబాబు ఈ మాట పట్టుకుని కామెడీ కూడా చేస్తున్నారు. కానీ ఇన్నర్ గా ఉన్న ఈ మాట తాలుకూ ఎఫెక్ట్ కి వణికిపోతున్నారట.

నిజంగానే జగన్ అంటున్న ఈ మాటకి ఏపీ ప్రజలు కదిలిపోతే జగనే సీఎం అవడంలో సందేహం లేదనేది అందరికి తెలిసిందే. ఎందుకంటే ఎదో సినిమాలో డైలాగులా ఏపీ ప్రజలు సెంటిమెంటల్ గా ఏదన్నా తీసుకుంటే మర్చిపోరు. ఇప్పుడు ఇదే జగన్ వ్యాఖ్యలు కూడా లానే ఏపీ ప్రజలు ఓన్ చేసుకుంటే మాత్రం చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయం అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

అందుకే బాబు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సరే ఈ ఒక్క మాటనే అస్త్రంగా జగన్ ఇక ముందు నుంచీ ప్రయోగించనున్నాడట జనాలకి ఈ మాట రీచ్ అయితే బాబు కి జింతాక చితా చితానే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.