రేవంత్ సభలలో కనిపించని ఉత్తమ్... నియోజకవర్గానికి పరిమితమైనట్టేనా

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం తరువాత అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్ గా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పని చేసినంతగా యాక్టివ్ అవడం లేదు.రేవంత్ నియామకాన్ని బహిరంగంగా స్వాగతించనూ లేదు, వ్యతిరేకించనూ లేదు.

 The Best That Is Not Seen In The Rewanth Sabhas ... Is Limited To The Constituen-TeluguStop.com

కాని ఎక్కడ కూడా రేవంత్ పాల్గొన్న కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు.అయితే ఇప్పటికే సీతక్క, భట్టి విక్రమార్క లాంటి సీనియర్ లు సభలలో ధర్నాలలో పాల్గొంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం సభలలో కనిపించడం లేదు.

అయితే ఉత్తమ్ కంటూ ప్రత్యేక వర్గం ఏమీ లేకపోయినా రేవంత్ పీసీసీ చీఫ్ నియామకం కంటే ముందు ఉన్నంత యాక్టివ్ గా ప్రస్తుతం ఉండడం లేదు.సీనియర్ నాయకుల క్యాడర్ ని రేవంత్ వర్గం దూరం పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందని విషయాన్ని వదిలేస్తే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఎంతో కొంత దూరం అయితే ఉందన్న మాట అంగీకరించవలిసిందే.అయితే కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు అనేవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి.

Telugu @revanth_anumula, Constituency, Komati Reddy, Telangana, Ts Congress, Ts

అధిష్టానం చెప్పినా అప్పటికప్పుడు కొన్ని రోజులు సర్దుమనుగుతాయి తప్ప మరల కొంత కాలానికి యధావిధిగా కొనసాగుతుంది.అందుకే తెలంగాణ ఇచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకరాలేకపోయారు.కొంత మంది కోవర్టులుగా మారినట్టు వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ప్రజల్లో కాంగ్రెస్ పై పోయిన నమ్మకం తిరిగి రావాలంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కటై పనిచేయాల్సిన అవసరం ఉంది.

లేకపోతే మరల ప్రతిపక్షం లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమింప బడ్డ తరువాత కాంగ్రెస్ కొంత బలపడడమే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube