ముఖంపై పేరుకున్న మురికి,జిడ్డు పోవాలంటే....కలబంద

సాధారణంగా ముఖంపై మురికి,జిడ్డు పేరుకుంటే మొటిమల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.మొటిమలకు కారణం అయిన మురికిని తొలగించుకోవడానికి మనకు సులభంగా అందుబాటులో ఉండే కలబంద సహాయపడుతుంది.

 The Benefits Of Using Aloe Vera For Skin Care-TeluguStop.com

అంతేకాక అనేక చర్మ సమస్యల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది.

కలబంద గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించాలి.ఈ ఆకులను పేస్ట్ చేసి కొన్ని చుక్కల తేనే కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే జిడ్డు,మురికి తొలగిపోతాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద గుజ్జు,అర స్పూన్ పెరుగు,అర స్పూన్ కీరదోస రసం,కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.చర్మం మీద మురికి పోవటమే కాకుండా అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల కలబంద గుజ్జు,ఒక స్పూన్ ఓట్స్,ఒక స్పూన్ కీరదోస తురుము వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వలయాకారంలో మసాజ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube