కారులో ఎక్కాల‌నుకున్న ఎలుగుబంటి.. కానీ చివ‌ర‌కు

సోషల్ మీడియాలో మనకు అనేక రకాల వీడియోలు కనిపిస్తుంటాయి.అందులో కొన్ని వీడియోలు మనకు భయాన్ని కలిగిస్తే కొన్ని వీడియోలు మాత్రం మనల్ని హాయిగా నవ్విస్తాయి.

 The Bear Who Wanted To Climb In The Car But To The End , Bear, Viral Video-TeluguStop.com

ఇలాగే ఒక ఎలుగుబంటి వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందంటే.

నేటి రోజుల్లో చాలా మంది పెంపుడు జంతువులు కలిగి ఉంటున్నారు.కొంత మంది కుక్కలు, పిల్లులను పెంచుకుంటుంటే మరికొంత మంది మాత్రం విచిత్రంగా సింహాలు, పులులు మరియు ఎలుగుబంట్లను పెంచుకుంటున్నారు.

వారు పక్కవారి కంటే ఎక్కువగా ఆ జంతువుల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఆ జంతువులకు ఏం జరిగినా కానీ సహించరు.

ఇలాగే ఓ వ్యక్తి పెంచుకుంటున్న ఓ ఎలుగు బంటి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అక్కడ ఒక చోట పార్క్ చేసి ఉన్న లంబోర్ఘిని కారును ఎక్కేందుకు ఎలుగు బంటి ప్రయత్నిస్తుంది.

ఆ లంబోర్ఘిని కారుకు ఉన్న వన్ సైడ్ డోర్ ను తీసి ఎక్కేందుకు చూస్తుంది.కానీ అలా తీసే క్రమంలో ఆ ఎలుగు బంటి ఊహించనిది జరుగుతుంది.

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.అలా డోర్ ను తీసే క్రమంలో ఆ కారు డోర్ మొత్తం ఊడిపోయి కింద పడి పోతుంది.

దీంతో భయం వేసి ఎలుగు బంటి అక్కడి నుంచి పారిపోతుంది.ఇలా ఎలుగు బంటి చేసిన ఈ పని ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదని ప్రయత్నం సక్సెస్ అయిందా? లేక ఫెయిలయిందా? అనేది పట్టించుకోకూడదని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.ఇంకా అనేక మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసేయండి.కడుపుబ్బా నవ్వుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube