ఒబామా కొత్త ఇల్లు..ప్రత్యేకతలు తెలిస్తే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పడూ ప్రత్యేకంగానే ఉంటారు.ఎంతో సింపుల్ గా, సాధారణ వ్యక్తిగా అమెరికాలో తన పిల్లలతో చక్కర్లు కొడుతూ, చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కి వెళ్తూ అందరిని అలరిస్తూ సందడి సందని చేసే ఒబామా ఒక్కసారిగా మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు.

 The Barack Obamas Buy Property In Marthas Vineyard-TeluguStop.com

సింపుల్ గా ఉండే ఒబామా ఓ దీవిలో అందమైన భవంతిని కొనుగోలు చేశారు.

ఇల్లు కొంటే ప్రత్యేకత ఏముంది అనుకోకండి, అది అలాంటి ఇలాంటి ఇల్లుకాదు, ఒక్క సారి ఆ ఇంటి ప్రత్యేకతలు తెలుసుకుంటే నోళ్ళు వెళ్లబెట్టాల్సిందే.

మసాచుసెట్స్ రాష్ట్రంలో మార్తాస్ వినియార్డ్ దీవిపై ఎంతో ఎత్తులో నిర్మించిన ఓ అందమైన భవంతి అది.సుమారు 29 ఎకరాలలో ఎంతో విస్తీర్ణంతో ఉన్న ఈ భవనంలో మొత్తం ఏడు పడకల గదులు ఉన్నాయి.ఒక్కో గది డబుల్ బెడ్ రూమ్ సైజు కంటే కూడా ఐదు రెట్లు పెద్దవిగా ఉంటాయట.అంతేకాదు

Telugu Dolor, Barack Obamas, Michelle Obama, Bedroom-

ఏడు పడకల గదులతో పాటుగా, తొమ్మిది బాత్ రూమ్ లు రెండు అతిధి రూములు, అధునాతన కిచెన్ తో పాటు స్విమ్మింగ్ పూల్ ప్రవైట్ బీచ్ , బొట్ హౌజ్ తో కలిసి ఎంతో సుందర వనంగా ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది.ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉండే పూల, పండ్ల మొక్కలు కూడా ఉంటాయట.ఎప్పుడూ ఈ ప్రాంతానికి సరదాగా గడపడానికి వచ్చే ఒబామా కుటుంభానికి ఈ ఇల్లు నచ్చడంతో కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube