ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదిన ఆ ఆటగాడు.. ఇదెలా సాధ్యమైందంటే..?

The Australian Cricketer Eight Sixes In One Over How Is It Possible

ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టిన క్రికెట్ ఆటగాళ్లను మీరు చూసే ఉంటారు.ఒక ఓవర్‌లో ఇంతకన్నా ఎక్కువ బౌండరీస్ బాదడం ఎవరికి సాధ్యం అవుతుంది? అది దాదాపు అసాధ్యం అని మనం అనుకుంటాం.కానీ ఒక బాట్స్‌మన్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టి ఇప్పటివరకూ ఎవరు సృష్టించని సరికొత్త రికార్డు సృష్టించాడు.అయితే ఇది నేషనల్ మ్యాచ్ లో నెలకొల్పిన రికార్డ్ ఏం కాదు.ఈ అరుదైన ఫీట్ ఆస్ట్రేలియాలోని ఓ క్లబ్ క్రికెట్‌లో ఆవిష్కృతమైంది.

 The Australian Cricketer Eight Sixes In One Over How Is It Possible-TeluguStop.com

సామ్ హారిసన్ అనే ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ అప్పుడప్పుడు క్రికెట్ క్లబ్స్‌లో ఆడుతుంటాడు.తాజాగా కూడా రెండు సీనియర్ క్లబ్స్‌కు జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.ఈ మ్యాచ్ సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మధ్య జరిగింది.అయితే ఈ మ్యాచ్ లో సోర్రెంటో డంక్రైగ్ క్లబ్ తరఫున ఆడుతున్న సమయంలో సామ్ హారిసన్ ఒక్కసారిగా విధ్వంసకర బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించాడు.ఈ జట్టు బ్యాటింగ్ సమయంలో.39 ఓవర్‌ను బౌలర్ బెన్నెట్ వేశాడు.అయితే అందులో రెండు బాల్స్ నో బాల్స్ అని అంపైర్ నిర్ణయించాడు.దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 8 బంతులు వేయగా.హారిసన్ 8 సిక్సర్లు బాదాడు.

Telugu 6 Sides, 8 Sixes, Australian Cricketer, Batsman, Club Cricket, Eight Sixes In One Over, One Over, One Over 50 Runs, Record Batsman, Sam Harrison, Sixers-Latest News - Telugu

అయితే ఎక్స్ట్రా గా వేసిన రెండు నో బాల్స్ కు రెండు పరుగులు ఇచ్చారు.దీనితో ఆ ఒకే ఓవర్ హారిసన్ 50 పరుగులు సాధించాడు.

 The Australian Cricketer Eight Sixes In One Over How Is It Possible-ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదిన ఆ ఆటగాడు.. ఇదెలా సాధ్యమైందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వరుసగా 8 బంతులను బౌండరీ దాటించడంతో హారిసన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ప్రపంచవ్యాప్తంగా అతని గురించి అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో అతను చేసిన అరుదైన ఫీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

చాలా మంది నెటిజన్లు హారిసన్‌ను బీభత్సంగా పొగిడేస్తున్నారు.

#Sixes #Sixes #Batsman #Sam Harrison #Club Cricket

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube