ఇదెక్కడి దారుణం...నిజం చెప్పినందుకు భారతీయుడిని అరెస్ట్ చేసిన సౌదీ...

సౌదీ లో మన భారతీయుడికి జరుగుతున్న అన్యాయంపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చేయని నేరానికి గడిచిన 20 నెలలుగా సౌదీ జైల్లో ఉంచి కనీసం అతడి కుటుంబానికి ఎలాంటి వివరాలు అందించకుండా ఎంతో కటినంగా అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నారై సంఘాలు, ఆయన కుటుంభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 The Atrocity Of This .. The Saudi Who Arrested The Indian For Telling The Truth,-TeluguStop.com

నిజం చెప్పడానికి వెళ్ళగా అతడినే అరెస్ట్ చేశారని తన భర్తను ఎలాగైనా విడిపించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తోంది.ఇంతకీ అసలేం జరిగింది, అతడిని ఎందుకు సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వివరాలలోకి వెళ్తే.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన శైలేష్ అనే వ్యక్తి సౌదీకి ఉపాది కోసం వెళ్ళాడు.అక్కడ ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన స్వదేశంలో ఉన్న భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు.

అయితే భారత ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి మద్దతుగా అతడు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాడు.అయితే అతడికి స్థానికంగా బెదిరింపు కాల్స్ రావడంతో భయంతో వాటిని డిలీట్ చేసేశాడు.

కాగ నెల రోజుల తరువాత అతడి పేరుపై ఫేస్ బుక్ ఓపెన్ చేసి అక్కడి సౌదీ రాజును దూషిస్తున్నట్టుగా ఫోటోలు పెట్టడం అతడి దృష్టికి వచ్చింది దాంతో భయంతో కొందరి సలహా మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు విషయాన్ని విచారించకుండా శైలేష్ ను అరెస్ట్ చేసి కోర్టుల ముందు ప్రవేశ పెడుతున్నారు.

తాను ఈ నేరం చేయలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని ఆయన భార్య కవిత ఆవేదన చెందుతున్నారు.స్వదేశంలో ఉన్న కవిత దాదాపు 20 నెలలు నుంచీ భర్తను విడిపించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు, ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త సహకారంతో కవిత స్థానిక ఎంపీ దగ్గరకు వెళ్ళగా, ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశారు.

ఇదిలాఉంటే సౌదీ లో ఉన్న కర్నాటకకు చెందిన కొందరు ఎన్నారైలు సైతం కవిత కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube