రకుల్ వివాహంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆ సమస్యలు వస్తాయంటూ?

ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించగా వేణుస్వామి రకుల్ జాకీ పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి చెప్పుకొచ్చారు.

 The Astrologer Venuswamy Comments About Rakul Preet Singh Marriage-TeluguStop.com

వివాహాలు ఫెయిల్యూర్ దిశగా సాగటానికి ముఖ్యమైన కారణాలలో షష్టాటకాలు ఒకటని వేణుస్వామి అన్నారు.

జాకీ భగ్నానీ జాతకాన్ని పరిశీలిస్తే తనది మకర రాశి అని అతని జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉందని జాతకంలో ఈ విధంగా ఉంటే వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని వేణుస్వామి పేర్కొన్నారు.

 The Astrologer Venuswamy Comments About Rakul Preet Singh Marriage-రకుల్ వివాహంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆ సమస్యలు వస్తాయంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రకుల్ రాశి మిధున రాశి అని తన జాతకంలో గురువు, కేతువు కలిసి ఉన్నాయని అందువల్ల కుటుంబంలో సౌఖ్యం ఉండదని వేణుస్వామి చెప్పుకొచ్చారు.రకుల్ జాకీ వివాహం జరిగితే సంతాన సమస్యలు, వివాహం ఆగిపోవడం, న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని వేణుస్వామి వెల్లడించారు.

రకుల్, జాకీ భగ్నానీ వివాహం చేసుకుంటే వివాహం తర్వాత విడిపోయే అవకాశాలు ఉంటాయని, కొన్నిసార్లు ఎంగేజ్ మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి పేర్కొన్నారు.

Telugu Interesting Comments, Rakul And Jackei Bhagnani, Rakul Astrology, Rakul Marriage, Rakul Preet Singh, Venuswamy, Venuswamy About Rakul-Movie

వీళ్లిద్దరికీ వివాహం జరిగితే చాలా కష్టనష్టాలు వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు.భయపెట్టడానికి తాను చెప్పడం లేదని చేతులు కాలక ముందే అవగాహన కలిగి ఉంటే మంచిదని తాను చెబుతున్నానని వేణుస్వామి అన్నారు.

Telugu Interesting Comments, Rakul And Jackei Bhagnani, Rakul Astrology, Rakul Marriage, Rakul Preet Singh, Venuswamy, Venuswamy About Rakul-Movie

వేణుస్వామి జాతకం కొంతమంది సెలబ్రిటీల విషయంలో నిజమైతే మరి కొందరు సెలబ్రిటీల విషయంలో నిజం కాలేదు.రకుల్ విషయంలో వేణుస్వామి జాతకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.సమంత విషయంలో వేణుస్వామి చెప్పిన జాతకం నూటికి నూరు శాతం నిజమైంది.

అయితే కొంతమంది మాత్రం ఈ కాలంలో కూడా జాతకాలను నమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

#Rakul #Venuswamy #Rakul Astrology #Venuswamy Rakul #RakulJackei

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు