టీడీపీ నేతల అరెస్ట్ లు ... సానుభూతి ! జగన్ సాధించేది ఏంటి ?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది టిడిపి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది జైలుపాలు అయ్యారు.అనేక వ్యవహారాలకు సంబంధించి సదరు నేతలపై కేసులు బనాయించి అరెస్టులు చేశారు.

 He Arrest Of Tdp Leaders Is A Problem For The Ycp Government Tdp, Ysrcp, Ap Gove-TeluguStop.com

ఇంకా ఈ అరెస్టుల పరంపర సాగుతూనే ఉంది.అరెస్టు అయితే  అవుతున్నారు కానీ మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చి కాలరెగరేసి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

తమపై అనవసరంగా కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.అయితే సదరు నేతలకు సంబంధించిన ఆధారాలను కోర్టుల్లో ప్రవేశపెట్టడంలో మాత్రం వైసీపీ విఫలమవుతున్నట్టుగానే కనిపిస్తోంది.

వివిధ కారణాలతో అరెస్టు చేయించినా, వైసీపీ ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏమీ లేదు అన్నట్లుగా తయారైంది.

కేవలం కొద్ది రోజులు మాత్రమే జైలులో పెట్టాము అన్న సంతృప్తి మాత్రమే మిగులుతోంది.

టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చూసుకుంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత నానా హంగామా టీడీపీ సృష్టించింది.రాజకీయ కక్షతో అరెస్టు చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.దాదాపు ఆయన నెల రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నారు.అయితే ఆయనను అరెస్టు చేసిన ఈఎస్ఐ స్కాం కు సంబంధించి ఇప్పటికీ తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించ లేకపోవడం, వందల కోట్ల అవినీతి జరిగిందనే దానికి సరైన ఆధారాలు లేకపోవడం తదితర కారణాల తో ఈ వ్యవహారంలో అభాసుపాలు కావాల్సి వచ్చింది.

ఇక అమరావతి వ్యవహారంలోనూ ఇదే చోటుచేసుకుంది.

Telugu Achhennaidu, Ap Cm, Ap, Chandrababu, Devineni Uma, Jagan, Tdp, Ysrcp-Telu

వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి పై అనేక విమర్శలు చేసింది.పెద్దఎత్తున టిడిపి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దర్యాప్తుకు ఆదేశించడం, దళితులకు చెందిన అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలను రుజువు చేయలేకపోవడం, తదితర వ్యవహారాలు కోర్టు వరకు వెళ్లినా , పెద్దగా టీడీపీ కి నష్టం ఏమీ జరగలేదు.

ఇక సంగం డైరీ విషయంలోనూ దూళిపాళ్ల నరేంద్ర ను అరెస్టు చేశారు.ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.కానీ ఇప్పటి వరకు సంగం డైరీ లో అక్రమాలకు సంబంధించి సరైన ఆధారాలు లభించలేదు.ప్రస్తుతం మాజీ మంత్రి దేవినేని ఉమ ను అరెస్ట్ చేశారు.

ఈ వ్యవహారంలోనూ సరైన ఆధారాలు సమర్పించ లేకపోతే అభాసు కావాల్సిన పరిస్థితి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube