అప్పు చేసి పప్పు కూడు ! ఇబ్బందేగా జగన్ ? 

జగన్ పరిపాలన బ్రహ్మాండంగా సాగిపోతోంది.  జగన్ ఎన్నికల ముందు ఏ హామీలిచ్చారో, అంతకు రెట్టింపు స్థాయిలో కొత్త కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఏపీ ప్రజల్లో చిరునవ్వులు కనిపించేలా చూసుకుంటున్నారు.

 Ap Government Social Schemes Bruden To Financial Condition Of Ap , Ap Cm Jagan,-TeluguStop.com

ఏపీలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా మరెక్కడా అమలు కావడం లేదు అంటే జగన్ గొప్పతనం ఏంటో అందరికీ అర్థం అయిపోతోంది.అంత పట్టుదలగా   ప్రజా సంక్షేమం పై జగన్ దృష్టి సారించారు అనే విషయం అర్థమవుతుంది.

గత రెండేళ్లుగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వేటికీ బ్రేక్ లేకుండా నిరంతరంగా అందిస్తున్నారు.ఆర్థికంగా వేల కోట్లు ఈ పథకాల కోసం ప్రతి నెల వెచ్చిస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నా, జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

దీంతో ప్రజల్లోనూ జగన్ పాలన పై సంతృప్తి  పెరిగింది.
  అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న విషయమే.

సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మంతా అప్పులు రూపంలో ఖర్చు పెడుతుండటం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా,  ఉద్యోగులకు ఇబ్బంది అవుతున్నా,  జగన్ మాత్రం సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతూనే వస్తున్నారు.

వచ్చిన సొమ్ము వచ్చినట్టుగా సంక్షేమ పథకాల కోసం ఖర్చయిపోతూ ఉండడంతో మిగతా అభివృద్ధి పనులకు విఘాతం ఏర్పడుతోంది.ఏపీలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది.

ఎక్కడికక్కడ పనులు పెండింగ్ లో పడిపోయాయి.ప్రజల్లోనూ ఈ విషయం పై తీవ్ర అసంతృప్తి ఉంది.

అలాగే ఏపీ రాజధాని విషయంలో జగన్ తీరు వివాదాస్పదం అవుతోంది.జగన్ ముందు చూపుతో వ్యవహరించకుండా, కేవలం సంక్షేమ పథకాలు అమలుచేస్తే చాలు, మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామ అనే  నమ్మకంతో జగన్ ముందుకు వెళ్తున్న తీరు రానున్న రోజుల్లో జగన్ తో పాటు ఏపీ కి ఇబ్బంది కలిగించే అంశమే.

Telugu Ap Cm Jagan, Ap, Apschemes, Chandrababu, Ysrcp-Political

  ప్రతినెల అప్పులతో నెట్టు కోస్తాము అంటే అది కుదరని పని.ఒకవైపు నిరుద్యోగం, అప్పులు పెరిగిపోతుండటం ఏపీకి, జగన్ కు కొత్త ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది.జగన్ ఏ సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారం వైపు నడిపిస్తాయి అని నమ్ముతున్నారో అవే పథకాలు రానున్న రోజుల్లో ఆర్థికంగా గుదిబండగా మారి జగన్ ను ఇబ్బంది పెట్టవచ్చు.ఒక్క పథకాన్ని మధ్యలో అపేసినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవ్వడం తో పాటు జగన్ ప్లాన్ బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube