ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ అది తన రూపురేఖలను మార్చుకుంటూ సరికొత్త అవతారాలతో.కొత్త వేరియంట్ రూపాలలో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తుంది.

 The Ap Government Is Ready To Say That The Minister Of Medical Health Alla Nani,-TeluguStop.com

తాజాగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ అనే ప్రమాదకర వైరస్… భయంకరంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో పాటు.మనిషి ప్రాణాలను కూడా తీసే విధంగా.

ఉండటంతో ప్రపంచ దేశాలు హడలెత్తి పోతున్నాయి.ఒమిక్రాన్ ఆఫ్రికా దేశంలో వెలుగులోకి రావడంతో… ప్రపంచ దేశాలు ఆఫ్రికా దేశనికి సంబంధించి రాకపోకలు ఆపేయడం జరిగాయి.

ఒమిక్రాన్ ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని.

ఎక్కడ వైద్య కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కొత్త వైరస్ నీ ఎదుర్కొనే విషయంలో సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్ వేరియంట్ నీ ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి జగన్ సూచనలు చేయడం జరిగిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ఈ ప్రమాదకర వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రెడీగా ఉందని విదేశీ ప్రయాణికులకు ఆర్టిపిసిఆర్ టెస్ట్ లు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో జనవరి 15 వ తారీఖు లోపు వ్యాక్సినేషన్ రెండు డోస్ లు కంప్లీట్ చేయాలని అధికారులకు మంత్రి ఆళ్ల నాని దిశానిర్దేశం చేశారు.

కొత్త ప్రమాదకర వైరస్ ఏ విధంగా వ్యాపించిన గాని వైద్య సదుపాయం ఎక్కడ కొరత లేకుండా ఆసుపత్రిలో బెడ్లు.ఉండేలా అధికారులు చూసుకోవాలని సీఎం జగన్ తెలిపినట్లు ఆళ్ల నాని చెప్పుకొచ్చారు.

ప్రజలంతా ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube