వైసీపీని తిట్టినా బీజేపీ ని నమ్మేవారేరి ? 

గత కొంత కాలంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ బిజెపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వం విషయంలో సానుకూల వైఖరితో ఉన్నట్టుగా కనిపిస్తున్న, ఏపీ బీజేపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వ లోపాలను హైలెట్ చేస్తూ, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

 Ap Bjp Leaders Do Not Care About The People Who Have Criticized The Ycp Governme-TeluguStop.com

టిడిపి మాదిరిగానే తాము కూడా వైసిపికి రాజకీయ శత్రువు అన్న సంకేతాలు ఇచ్చేందుకు ఏపీ బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.అందుకే గతకొద్దికాలంగా ఏపీ బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను జగన్ ప్రభుత్వం పేరు మార్చి వాడుకుంటోంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

అలాగే కేంద్ర బడ్జెట్ కు ఏపీ బడ్జెట్ కి లింకు పెట్టి విమర్శలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు వస్తున్న క్రమంలో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నబీజేపీ నేతలు ఈ సందర్భంగా ఏపీ లో నిర్వహించిన సమావేశంలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ముఖ్యంగా ఐవైఆర్ కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు .ఒక్క క్లిక్ తో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని మండిపడ్డారు.అసలు బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్ ను చూడాలని, బడ్జెట్ ను ఎలా రూపొందించ కూడదో తెలుసుకోవాలంటే ఏపీ బడ్జెట్ ను చూడాలని అన్నారు.

ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో 37 వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించిందని , కానీ 57 వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్ నొక్కి వాటిని జనాలకు పంచేసారని విమర్శించారు.

ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు బాగుపడినట్టు ఎక్కడా లేదని, అది వ్యక్తి అయినా , సంస్థ అయినా , ప్రభుత్వం అయినా అదే జరుగుతుందని కృష్ణ రావు విమర్శలు చేశారు.ఇక సోము వీర్రాజు వంటి వారు ఇంతే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అయితే వైసీపీ బీజేపీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేసినా,  జనాలు మాత్రం బిజెపిని నమ్మనట్టు గానే వ్యవహరిస్తున్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పై సానుకూలంగా స్పందిస్తుందని,  కానీ ఏపీ బీజేపీ నేతలు వాటిపైన విమర్శలు చేయడం రాజకీయ డ్రామా అన్నట్లుగా జనాల్లోకి వెళ్లడం తోనే ఏపీ బీజేపీ నేతలు ఎంతగా గొంతు పెంచినా ప్రయోజనం లేదనట్లుగా పరిస్థితి తయారైంది.

Ap Bjp Leaders Do Not Care About The People Who Have Criticized The Ycp Government Ap BJP

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube