అమెరికా అబార్షన్ బిల్లు సుప్రీం లో నిలిచేనా.  

The American Abortion Bill Is In The Supreme.-america,bill,supreme Court,telugu Nri Updates,అబార్షన్ బిల్లు

అమెరికాలోని అలబామా రాష్ట్ర ప్రతినిధులు అబార్షన్ పై నిషేధం విధించి బిల్లు ప్రవేశపెట్టిన విషయం విధితమే అయితే ఈ బిల్లు సుప్రీంకోర్టు లో నిలబడదని వాదిస్తున్నారు అబార్షన్ అనుకూల వర్గం. దాంతో ప్రతినిధులు ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సందిగ్ధత ఏర్పడింది.మరి ఈ బిల్లుపై సుప్రీంకోర్టు లో ఎలా నిలువదు, అబార్షన్ మద్దతు దారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే వివరాలలోకి వెళ్తే..

అమెరికా అబార్షన్ బిల్లు సుప్రీం లో నిలిచేనా.-The American Abortion Bill Is In The Supreme.

అలబామా రాష్ట్ర ప్రతినిధులు అబార్షన్ ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ఈ బిల్లుపై 25 మంది సెనెటర్లు సంతకం చేసి మద్దతు తెలిపారు. ఇదే బిల్లుకి వ్యతిరేకంగా కేవలం ఆరుగురు మాత్రమే ఆమోదం తెలిపారు. కానీ ఈ బిల్లు సుప్రీంకోర్టు లో నిలబడదని. ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అబార్షన్‌ మద్దతు దారులు అంటున్నారు.

ఆ బిల్లుపై వేసిన అభ్యర్థనలు, సమస్యని సుప్రీంకోర్టు వరకూ తీసుకు వెళ్తాయని భావిస్తున్నారు.

1973లో ఏర్పాటు చేసిన ఈ అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న తాజా బిల్లుని ప్రవేశపెట్టింది. ఇదిలాఉంటే అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ అబార్షన్ పై అదనంగా కొన్ని నిభందనలు విధించాయి తప్ప నిషేధం విధించలేదు. అయితే సెనేట్ లోని కొందరు మహిళా సెనేట్లు కూడా బిల్లుపై సంతకం పెట్టక పోవడం గమనార్హం.

ఈ బిల్లుపై గవర్నర్‌ కే ఐవీ కూడా పెట్టాల్సి ఉంది. అబార్షన్‌ చట్టాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చారని స్థానిక నేతలు, అబార్షన్ మద్దతు దారులు, సంస్థలు గుర్తు చేస్తున్నారు.