ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన భీకర ప్రళయాన్ని అందరూ ప్రత్యక్షంగా చూసిన వారే.లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎంతో మంది ఆర్ధికంగా, మానసికంగా కుంగిపోయారు.
ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ కరోన మహమ్మారి.చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి ని నిలువరించడానికి పలు విధాలుగా వ్యాక్సిన్ లపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు.
అమెరికాలో డిసెంబర్ చివరి వారంలో వ్యాక్సిన్ రిలీజ్ అవుతుందని త్వరలో ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని ఫార్మా కంపెనీలు ప్రకటించాయి.ఇదిలాఉంటే
కరోనా సోకినా తరువాత చాల అమందికి చిన్నపాటి లక్షణాలతో మొదలయ్యి తరువాత వెంటనే తగ్గుముఖం పడుతోంది.
కొందరికి కరోనా సోకిన రెండు రోజుల్లో వెంటనే తగ్గిపోతోంది.అందుకు కారణం ఏమయ్యి ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు కొన్ని నెలలుగా చేస్తోనే ఉన్నారు.
ఈ క్రమంలో వారు ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు అదేంటంటే.
కరోనా వైరస్ మన శరీరంలో ప్రవేశించడానికి ప్రధానమైన మార్గాలు కేవలం ముక్కు, నోరు మాత్రమే.ఈ రెండు భాగాలలో ఉండే శ్లేష్మ పొరలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటం ద్వారా మాత్రమే కరోనా ప్రభావం అలాంటి వారిలో ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని కనుగొన్నారు.అమెరికాలోని ఎట్ బఫే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
అంతేకాదు ముక్కు , నోటి ద్వారా అందించగలిగేలా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తే మరిన్ని సత్ఫలితాలు ఉంటాయని, కరోన మహమ్మారి పై మనం విజయం సాధించవచ్చునని తెలిపారు.